చంద్రయాన్ 2 చివరి నిమిషాల్లో ఏం జరిగిందో తెలిస్తే షాక్

128

కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ – 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. విఫలమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 2.1 కిమీ దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరి కొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందకుండా పోయాయి. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయని ఆశించిన శాస్త్రవేత్తలకు చేదు సమాచారం అందింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం వైపు క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు. కాలం గడుస్తున్నప్పటికీ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో భూమితో సంబంధాలు తెగిపోయినట్లు ధృవీకరించారు. విక్రమ్ ల్యాండర్‌ ప్రయాణం 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు సజావుగా సాగిందని, తర్వాతే సంకేతాలు నిలిచిపోయినట్టు ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. లోపాలకు గల కారణాలను విశ్లేషిస్తామని ఆయన తెలిపారు.

Image result for చంద్రయాన్ 2 కూలిపోవడానికి

తన 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి ఒక్కసారిగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న యావత్తు ప్రపంచం నిరాశకు గురైంది. అంతకు ముందు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి 15 నిమిషాల ముందు తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంది. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దింపేందుకు‘విక్రమ్‌’ ల్యాండర్‌కు శాస్త్రవేత్తలు సంకేతాలు పంపారు. అంతా సవ్యంగా ఉందని నిర్ణయానికి వచ్చిన శాస్త్రవేత్తలు 78 సెకెన్ల అనంతరం సంకేతాలు పంపుతూ ల్యాండర్‌ను ఉపరితలంపై దింపారు. ఈ సమయంలో ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు పనిచేయడం ఆరంభించి, దాని గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గించాయి. అనంతరం ల్యాండర్‌ కిందకు దిగడం మొదలయింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల వరకు ల్యాండర్ ప్రయాణం సవ్యంగా సాగింది. సరిగ్గా ఇక్కడ నుంచే సిగ్నల్స్ నిలిచిపోయాయి.

ఈ క్రింద వీడియో చూడండి

మరోవైపు, చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ దిగే ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విక్రమ్ ల్యాండర్ కనిపించకపోయిన కాస్సేపటి తరువాత కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి బయటికి వచ్చారు. ఫెయిల్ అయ్యిందని బాధపడుతున్న ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో విజయం అందుకుంటారనే నమ్మకం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలోని ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని, మీరు సాధించింది తక్కువేం కాదని అపజయం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో ఆశావాద దృక్పథంతో సాగుదామని, దేశం యావత్తు మీ వెనుక ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా ప్రపంచం మొత్తం ఎంతో అతృతతో ఎదురుచూసిన చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం కాస్త బాధించే అంశమే. మరి చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.