గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర!

33

బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజే.ఆడవాళ్లకు అయితే మరి ఎక్కువగానే ఉంటుంది.అందుకే చేతిలో డబ్బు ఉంటె చాలు బంగారం కొనాలనుకుంటారు. ఉన్నత వర్గాల వారు తమ హోదాకు తగినట్లుగా వజ్రాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటే ఎగువ, దిగువ మధ్యతరగతి వారు మాత్రం బంగారానికే ఓటేస్తున్నారు. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం పడిపోయింది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for gold

పసిడి పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.230 తగ్గుదలతో రూ.39,130కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గుదలతో రూ.35,870కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో పురోగతి లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

Image result for gold

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.31 శాతం తగ్గుదలతో 1,506.95 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.31 శాతం క్షీణతతో 16.88 డాలర్లకు తగ్గింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,300కు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.37,100కు క్షీణించింది. ఇక కేజీ వెండి స్థిరంగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక విజయవాడలో 22 క్యారెట్ల ధర 35,882 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,732 ఉంది. విశాఖ ప‌ట్నం 22 క్యారెట్ల ధర 35,882 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,682 ఉంది. బెంగళూరు 22 క్యారెట్ల ధర 35,343 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,103 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర 35,892 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,702 గా కొనసాగుతున్నాయి.. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. చూశారుగా వివిధ నగరాలలో బంగారం రేట్ ఎలా ఉందొ.