కుక్క‌ర్ ఇలా వాడ‌కండి.. కంటిలోకి దూసుకువెళ్లిన కుక్క‌ర్ విజిల్

1006

గ్యాస్ ద‌గ్గ‌ర ప‌నిచేసే స‌మ‌యంలో మ‌హిళ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అంతేకాదు కుక్క‌ర్ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. ఏమాత్రం కుక్క‌ర్లో వాట‌ర్ వేయ‌కుండా కుక్క‌ర్ పెట్టినా విజిల్స్ చూడ‌కుండా మ‌ర్చిపోయినా, కుక్క‌ర్లు పేలిపోతాయి, అందుకే వంటింట్లో మ‌హిళ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి..ముఖ్యంగా గ్యాస్ త‌ర్వాత అత్యంత ప్ర‌మాద‌మైంది కుక్క‌ర్, అందుకే ఇంట్లో కుక్కరు ఉన్నట్లయితే.. ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవమే మీకూ ఏర్పడవచ్చు… ఇంత‌కీ కుక్క‌ర్ వ‌ల్ల వ‌చ్చిన చేదు అనుభ‌వం ఏమిటి అనుకుంటున్నారా, ఈ వీడియో చూడండి.

Image result for కుక్క‌ర్ విజిల్

జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాకు చెందిన ముందా బిర్సి అనే మ‌హిళ కుక్కర్లో పప్పు పెట్టి స్టావ్ వెలిగించింది. త‌ర్వాత గార్డెన్‌లోకి వెళ్లి గడ్డి కత్తిరించే పనిలో నిమగ్నమైంది. గంట తర్వాత స్టావ్ మీద ఉన్న కుక్కరును స్టావ్ మీద నుంచి పక్కకు పెట్టేందుకు ప్రయత్నించింది. ఆ ఒత్తిడికి కుక్కరు విజిల్ ఒక్కసారిగా పైకి ఎగిరి ఆమె ఎడమ కంటిని చీల్చుకుంటూ తలలోకి వెళ్లింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ విజిల్ బయటకు కనిపించనంత లోపలికి దూసుకెళ్లడంతో వైద్యులు సీటీ స్కాన్ చేశారు. అది మెదడుకు సమీపంలో ఇరుక్కున్నట్లు గుర్తించారు.

Image result for కుక్క‌ర్ విజిల్

వెంట‌నే ఆమెకు భగవాన్ మహావీర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేసి విజిల్‌ను బయటకు తీసి ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, ఆమె కంటి చూపును మాత్రం తిరిగి తీసుకురాలేకపోయారు. విజిల్ ఆమె కంటిని పూర్తిగా ఛిద్రం చేసింది. దీంతో ఆ కంటిని కుట్లు వేసి మూసివేశారు.ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్ ఆశిష్ జాయ్ సొరెన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మేము విజిల్ చుట్టు పేరుకున్న వ్యర్థాలను తొలగించాం. విజిల్ బయటకు లాగేప్పుడు రక్తం తీవ్రంగా పోతుందని భావించాం. ప్రత్యామ్నంగా రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచాం. ఆ విజిల్‌ను తీయడం ఎంతో కష్టమైంది. ఏ మాత్రం తేడా జరిగిన ఆ విజిల్ చుట్టూ ఉండే కణజాలాలు దెబ్బతినేవి’’ అని తెలిపారు.

ఈ క్రింద వీడియో చూడండి

బిర్సి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గార్డెన్ పనిలో పడి కుక్కరు విషయం మరిచిపోయిందని, విజిల్స్ కూడా రాకపోవడంతో దాన్ని స్టావ్ మీద నుంచి కింద పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కుక్కరులో నీళ్లు పూర్తిగా ఆరిపోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి విజిల్ ఆమె కంట్లోకి దూసుకెళ్లిందన్నారు. వేడిగా ఉన్న విజిల్ కంటి లోపలికి వెళ్లిపోవడంతో బాధతో విలవిల్లాడిందన్నారు. చూశారుగా.. మీరు కూడా కుక్కరుతో వంట చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్ర‌మాదాలు ఎప్పుడూ చెప్పి రావు, ఆమెకు కంటిచూపు పోయింది. మ‌హిళ‌లు వంట చేసే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి.