కాకి పదే పదే ఇంటి ముందు అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా

963

కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం? జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు కనక్టయి ఉంటాయి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అలాగే కాకి గురించి కూడా చాలానే ఉన్నాయి…మన పూర్వీకుల ప్రకారం మనుషుల జీవితం, మరణం.. కాకితో లింక్ అయి ఉన్నట్టు విశ్వసిస్తారు. అలాగే కొన్నిసార్లు చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్ముతారు. దీన్నిబట్టి.. కాకులు మన భవిష్యత్ ని అంచనా వేయగలుగుతాయని అర్థం చేసుకోవచ్చు.

Image result for crow

అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పని విజయం సాధిస్తారన్నదే సంకేతం. నీళ్ళు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం.
కాకి మాంసం ముక్కను పట్టుకెళుతూ కింద ఏ వ్యక్తిపైనా పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమాని కానీ, లేకుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారు సమస్యల్లో పడతారు. ఒక వ్యక్తి తలమీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి మహిళ ఒళ్ళోగాని, తలపై గానీ కూర్చుంటే భర్త సమస్యల్లో పడతాడని సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్యలాభం పొందుతారు. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఒకవేళ మీరు బయటకు వెళ్లేటప్పుడు.. కాకి వచ్చి.. గట్టిగా అరిచి.. వెళ్లిపోయింది అంటే.. మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం…ఒకవేళ కాకి తన నోట్లో.. రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్లడం చూశారంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని, మంచి జరగబోతోందని సంకేతం…ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్లు లేదా ఆడవాళ్లను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే.. ఆ వ్యక్తి.. కాస్త అనారోగ్యానికి గురవుతారని సంకేతం.ఒకవేళ కాకి రెక్కలు కొడుతూ.. గట్టిగా కంటిన్యూగా అరుస్తూ కనిపించిందంటే.. మరణం ఉందని.. సూచిస్తూ.. సందేశాన్ని ఇస్తోందని అర్థం.కాకి అరిస్తే బందువులు వస్తారు అనేది అపనమ్మకం. మనం బయటకు వెళ్లిన సమయంలో దగ్గరకు వస్తూ వెళుతూ మనల్ని నడవనివ్వకుండా ఆపుతుంది అంటే ఆరు నెలల్లో చనిపోతాం అని అర్దం. ఒకవేళ మనల్ని తన్నుకుంటూ వెళితే నెల రోజుల్లో చావు తప్పదు అని సంకేతం. మరి కొందరు వీటిని విశ్వసించే వారు ఉంటారు, నమ్మకుండా ఉండేవారు ఉంటారు, ఎవరి అభిప్రాయాలు అయినా గౌరవించాలి, మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్సల్ రూపంలో తెలియచేయండి.