కడుపులో పిండం చనిపోతే ఆ తల్లి ఏమి చేసిందో తెలిస్తే కన్నీళ్లాగవు

62

ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ… ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం అందరూ ఒప్పుకోవాల్సిందే.ఇక అప్పటిదాకా తమ మధ్య తిరుగుతూ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని అందిస్తున్న కుటుంబ సభ్యురాలు తల్లి కాబోతోందనే సంగతి తెలిసిన మరుక్షణం ఆ ఇంటిలో చోటు చేసుకునే హడావుడి అంతా ఇంతా కాదు. సైలెంట్ గా ఉండే మామగారు సైతం కోడలు పిల్ల ఆరోగ్యం గురించి, వచ్చే కొత్త సభ్యుని గురించి ఆసక్తి కనబరుస్తుంటారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలను పాటించాలని తల్లి, అత్తమామలు, సోదరులు, మిత్రులు పలు సలహాలు, సూచనలను ఇస్తుంటారు. అయిన వారు ప్రేమతో అందించే సలహాలు, సూచనల్లో వేటిని పాటించాలనేది పెద్ద ప్రశ్నగా నిలుస్తుంది..గర్భం ధరించిన సమయం నుండే తల్లి ఆ బిడ్డపై మమకారాన్ని పెంచుకుంటుంది. అయితే ఆ బిడ్డ ప్రపంచాన్ని చూడకముందే కడతేరితే ఆ తల్లి పడే బాధ అంతా ఇంతా కాదు. ఈ విషాదకరమైన ఘటన అమెరికాలోని మిస్పోరీలో జరిగింది.నిజంగా ఇలాంటి ఘటన ఇప్పటి వరకూ జరిగి ఉండదు అనే చెప్పాలి.

Image result for pregnant lady

శర్రాన్ సుదేర్లాండ్ అనే మహిళ గర్భంలో పెరుగుతున్న పిండం 14 వారాలకే చనిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించి పిండాన్ని తొలగించాలని చెప్పారు. పిండాన్ని తొలగించేటప్పుడు ముక్కలవుతుందన్నారు. అయితే పిండాన్ని ముక్కలు చేయొద్దని, తనకు అప్పగించాలని కోరడంతో వైద్యులు సర్జరీతో వెలికి తీసి ఆమెకు అందించగా, తన ఇంటికి తీసుకెళ్లింది. 14 వారాలకే ఆ పిండానికి పూర్తిగా అవయవాలు తయారవగా 26 గ్రాముల బరువు, 4 ఇంచుల పొడవు ఉంది. పిండాన్ని అలాగే ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు సెలైన్ సీసాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టింది. వారం రోజులు అలాగే గడిచిన తర్వాత చివరికి పూడ్చిపెట్టక తప్పలేదు.

Image result for pregnant lady

వైద్యులు నా బిడ్డను పిండం, మెడికల్ వేస్ట్ అని పిలవడం నాకు ఏ మాత్రం నచ్చలేదు, కోపం వచ్చింది. అందుకే నా బిడ్డను నాకు అప్పగించాలని కోరాను. ఆ తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక హాస్పిటల్ నుంచి తెచ్చిన సెలైన్ సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాను. ఈ లోకం నా గురించి ఏమనుకున్నా ఫర్వాలేదు, కానీ నేను నా బిడ్డను పూడ్చకూడదని భావించాను. కానీ వారం తర్వాత, పిండం పాడవుతుందని చెప్పడంతో, వేరే దారి లేక ఆ ప్రాణానికి ఊపరి పోయడం కోసం పూల కుండీలో పూడ్చిపెట్టాను. ఇక నా బిడ్డ ఆ మొక్కరూపంలో పెరుగుతాడు అంటూ భావోద్వేగానికి గురైంది. నిజంగా ఆమె బాధ సోషల్ మీడియాలో చెప్పుకుని కన్నీరు పెట్టుకుంది. ఆమె పోస్టు చూసిన ప్రతీ ఒక్కరు ఈ బాధ జీవితాంతం ఉంటుంది అని మరో రూపంలో నీకు అదే బిడ్డ జన్మిస్తాడు అంటూ ఆమెకు భరోసా ఇచ్చారు.. చూశారుగా వెలకట్టలేని ప్రేమ కన్నతల్లిది, ఆమెకు అదే రూపంలో మరో బిడ్డ రావాలని మనం కూడా కోరుకుందాం.