ఓ ఐఏఎస్ రియల్ స్టోరీ.. ఆమె భర్త కూలీ.. భార్యను ఐఏఎస్ చదివించిన భర్త చివరికి ఏమయ్యాడో తెలిస్తే షాక్

3767

భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి ఒకరి కోసం ఒకరు బతకాలి. అవసరం అయితే చావును కూడా ఎదురించాలి. కానీ ఈ కాలంలో అలా ఎవరు ఉండటం లేదు. నీది నీదే నాది నాదే అనే ధోరణికి వచ్చారు. అయితే అందరు అలాగే ఉండరు. కొందరు భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరిగా ఉంటారు. వారి సుఖాన్ని వారి కష్టాన్ని ఇద్దరి కష్టంగా భావిస్తారు. అలాంటి ఒక భర్త గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. భార్య ఆశయాన్ని నిజం చేసిన భర్త కథ.. భార్య సక్సెస్ తన సక్సెస్ గా భావించే ఉత్తమ భర్త రియల్ స్టోరీ ఇది. కలెక్టర్ కావాలన్నా తన భార్య కలను నిజం చేశాడు. భార్య కలను నిజం చెయ్యడం కోసం ఏకంగా ప్రాణాలనే రిస్క్ లో పెట్టాడు. మరి ఆ భార్యాభర్తల కథేంటో పూర్తిగా తెలుసుకుందాం.

Image result for ias officer

బీహార్ కు చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్నప్పటినుంచి చదువుకుంది లేదు. అందుకే చిన్నప్పటినుంచే పనుల కోసం వెళ్ళేవాడు. ఇక అతనికి పెళ్లి వయసు వచ్చే సరికి కూడా రోజు వారి కూలి పనిచేసేవాడు. అయితే అతనికి సంబంధాలు వచ్చినా కూడా ప్రవీణ్ పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే వారెవరు కూడా చదువుకోలేదు. నాకు చదువులేక నాకు వచ్చే భార్యకు కూడా చదువు లేకపోతే నా పిల్లలకు కూడా చదువు చెప్పేవాళ్ళు ఉండరు. నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు కానీ కొంచెమైనా చదువుకున్నా అమ్మాయి భార్యగా రావాలని అనుకున్నాడు. ఇక ప్రవీణ్ అనుకున్నట్టే అతని ఇంట్లో వాళ్ళు ఇంటర్ చదివిన ఒక పేదింటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు… అయితే మూడు నెలలు కాపురం చేశాక ప్రవీణ్ కు తన భార్య మనసులోని కోరిక తెలిసింది. ఆమె చదువుకుని కలెక్టర్ అవ్వాలని ఆశపడుతుందని తెలిసింది. వెంటనే ఆమెను డిగ్రీలో జాయిన్ చేశాడు. ఒక కూలి భార్యకు చదువెందుకు.కలెక్టర్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అందరు అన్నారు, కాని ఆమె ఆశయం కోసం ఆమెని డిగ్రీలో చేర్చాడు.

Image result for ias officer

అయితే అతనికి వచ్చే కూలి డబ్బులు సరిపోక రాత్రిపూట బస్తాలు మోసే పనికి వెళ్ళేవాడు. అలా కష్టపడి మూడేళ్లలో భార్యను డిగ్రీ చదివించాడు. ఆ తర్వాత గ్రూప్స్ కోచింగ్. అది చేయించాడు. అలా రెక్కలు ముక్కలు చేసుకుని భార్యను చదివించాడు. అయితే ఆమె ప్రిపేర్ అవుతున్న సమయంలో డబ్బులు సరిపోక అప్పులు చేశాడు. కొన్నిరోజులు నిద్రకూడా పోకుండా పనికి వెళ్లి డబ్బులు సంపాదించాడు. అతని భార్య కూడా అతని కష్టాన్ని గుర్తించింది. రెండో ప్రయత్నంలోనే ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యింది. తానూ సాధించిన దానిని భర్తకు చెబుదాం అని జాయినింగ్ ఆర్డర్ తీసుకుని ఇంటికి వెళ్లేసరికి శశికి షాకింగ్ విషయం తెలిసింది. ప్రవీణ్ నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్స్ షాకింగ్ విషయం చెప్పారు. అతని బాడీ పట్టు తప్పింది. శరీరంలో ఏ అవయవం కూడా బాగా పనిచెయ్యడం లేదు. అతను గత ఐదేళ్ళలో సరిగ్గా నిద్రపోయినట్టు లేడు. శరీరం బాగా నలిగిపోయింది. కండరాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందుకే పిట్స్ వచ్చాయి అని చెప్పారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇప్పుడు అతను కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక ఆదేవుడే కాపాడాలి అని డాక్టర్స్ వెళ్లిపోయారు. శశికి జరిగింది అర్థం అయిపోయింది. తన కోసమే భర్త ఇంతలా కష్టపడ్డాడు. ఈరోజు ఇలా అయిపోయాడు అంటూ బోరున ఏడ్చింది. రెండు నెలల తరువాత ఐఏఎస్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యింది. భర్తను పెద్ద హాస్పిటల్ లో జాయిన్ చేసింది. ఏరోజు అయినా భర్త కోమాలో నుంచి బయటకు వస్తే తానూ ఉన్న మంచి పొజిషన్ ను చూసి తాను పడ్డ కష్టానికి నా భార్య సాధించింది అని తన భర్త అనుకుంటాడు అని భావిస్తోంది…. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తన భర్త స్పృహలోకి వచ్చి సంతోషిస్తాడు అని తన భర్తను చూసుకుంటూ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త కోమాలోనుంచి బయటకు రావాలని మనం కూడా కోరుకుందాం. మరి భార్య ఆశయాన్ని నిజం చెయ్యడం కోసం ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకున్న ఈ భర్త ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.