ఏటీఎంలో నగదు కావాలంటే ఓటీపీ బ్యాంకులు కీలక నిర్ణయం ఎప్పటినుంచంటే

48

సాధారణంగా ఏటీఎంలలో డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎం కార్డ్, పిన్ నంబర్ తెలిస్తే సరిపోతుంది. కానీ ఈ మధ్య ఏటీఎం కార్డు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. వినియోగదారులకు తెలియకుండానే వారి ఏటీఎంలను ఉపయోగించి డబ్బులు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మోసగాళ్ళు ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపు ఏడాదికి 1500 కోట్ల రూపాయల వరకూ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి.. పోలీసులు వారిని పట్టుకునేలోపు వారు డబ్బులు ఖర్చు చేస్తున్నారు ..వాటిని రికవరీ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అసలు ఏటీఎం సెంటర్ కు వెళ్లిన సమయంలో, మన డబ్బులు మనకు రాకపోతే ఆ కార్డు ద్వారా మోసాలు చేసేవారు కూడా మనల్ని ఏమర్చి కార్డుని రెండోసారి స్వైప్ చేసి డబ్బులు నొక్కేస్తున్నారు. అందుకే ఇలాంటి జాదుగాళ్లకి చెక్ పెట్టాలి అని చూస్తునాయి బ్యాంకులు. అసలు ఇలా ఏటీఎం సర్వీసులు కూడా వచ్చే రోజుల్లో ఉండవు అనే వార్తలు వనిపిస్తున్నాయి.. మొత్తం డిజిటల్ ఇండియాగా భారత్ మారుతోంది. అందుకే ప్రతీ ఏడాది 15 శాతం ఏటీఎంలు తగ్గించాలని చూస్తోంది కేంద్రం.

ఈ క్రింద వీడియో చూడండి

తాజాగా ఏటీఎం మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు వినూత్న ఆలోచన చేసింది కెనరా బ్యాంకు. ఒక సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చిందని సమాచారం. ఇప్పటినుండి కెనరా బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ఒకరోజులో పదివేల రుపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవాలంటే మొబైల్ కు వచ్చే ఓటీపీని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిందే. 10 వేల రుపాయల లోపు నగదుకు మాత్రం ఈ నిబంధన వర్తించదని తెలుస్తోంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కెనరా బ్యాంకు ఈ నిబంధనను రూపొందించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉంది. రోజు రోజుకు దేశంలో బ్యాంకులకు సంబంధించిన సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. బ్యాంకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వలన సైబర్ నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంది. సో వచ్చే నెల నుంచి కెనరా బ్యాంకు ఈ సదుపాయాన్ని తీసుకువస్తుంది. ఓటీపీ రెండు సార్లు రాంగ్ టైప్ చేస్తే, ఇక మూడోసారి అవకాశం ఉంటుంది. అది కూడా రాంగ్ టైప్ చేస్తే మీ కార్డు బ్లాక్ అవుతుంది.

Image result for atm

కెనరా బ్యాంక్ ప్రవేశపెట్టిన ఈ నిబంధన వలన వినియోగదారులకు తెలీయకుండా ఇతరులు కార్డును వినియోగించే అవకాశాలు తగ్గుతాయి..అలాగే బ్యాంకులు ఏటీఎం కార్డులకు గతంతో పోలిస్తే అధికంగా భద్రతను కల్పించినట్లు అవుతుంది. దేశంలో అతి పెద్దదైన ఎస్బీఐ బ్యాంక్ కూడా త్వరలోనే డెబిట్ కార్డులను రద్దు చేయబోతుందని తెలుస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా డెబిట్ కార్డులకు స్వస్తి పలకాలని ఎస్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎస్బీఐ డెబిట్ కార్డులను రద్దు చేయబోతున్నట్లు తెలుస్తుంది. దేశంలో మొత్తం 93 కోట్ల డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సో కచ్చితంగా ఏటీఎంలకు వెళితే ఇక మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లి ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే, మరి కెనరా బ్యాంకు తీసుకువచ్చిన ఈ నిబంధనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.