ఈ క్రికెటర్స్ అందరు పేదవాళ్ళు….ఇప్పుడు కోట్లకు అధిపతులు

42
 1. షోయబ్ అక్తర్..
  ఇతను పాకిస్తానీ క్రికెటర్. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్ గా షోయబ్ అక్తర్ కు పేరు ఉంది. క్రికెట్ లో షోయబ్ అక్తర్ ను రావల్పిండి ఎక్స్ ప్రెస్ అని కూడా అంటారు. ఇతను క్రికెట్ లోకి రాకముందు ఇతని జీవితం ఎంతో పేదరికంలో ఉండేది. ఇతని కుటుంబం ఎంత పేదరికంలో ఉండేదంటే..ఇతని కుటుంబం మూడుపూటల తినడానికి కూడా ఉండేది కాదు. ఇతను క్రికెట్ ప్రాక్టీస్ చెయ్యడం కోసం 2 కిమీ దూరం నడిచి గ్రౌండ్ కు వెళ్ళేవాడు. ఒకసారి లాహోర్ లో క్రికెట్ మ్యాచ్ ఉంటె లాహోర్ వెళ్ళడానికి ఛార్జీలకు డబ్బు కూడా లేదంట. అప్పుడు దొంగతనంగా బస్సు పైకి ఎక్కి లాహోర్ వెళ్లడంట. ఈ విషయం ఒక ఇంటర్యూలో షోయబ్ అక్తర్ చెప్పాడు. అదృష్టం బాగుండి లాహోర్ లో ట్రయిల్ టెస్ట్ లో సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ టీమ్ కు సెలెక్ట్ అయ్యాడు.
Image result for షోయబ్ అక్తర్..
 1. క్రిస్ గేల్…
  ఇతను వెస్ట్ ఇండీస్ క్రికెటర్. ప్రపంచంలోనే అత్యంత్య పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్ గా క్రిస్ గేల్ గురించి చెప్పుకుంటారు. ఇతనికి వెస్ట్ ఇండీస్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ ఉన్నారు. ఇతను కూడా క్రికెట్ లోకి రాకముందు ఎంతో పేదరికాన్ని అనుభవించాడు. క్రిస్ గేల్ చిన్నప్పుడు రోడ్ల మీద పడేసిన వాటర్ బాటిల్స్ ను ఏరుకొని వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో జీవించేవాడు. ఒకప్పుడు జమైకాలో చిన్న పూరి గుడిసెలో జీవించిన గేల్ ఇప్పుడు కోట్ల భవంతిలో నివసిస్తున్నాడు. ఒక ఇంటర్యూలో గేల్ తన పాస్ట్ గురించి చెప్తూ..ఒకవేళ నేను క్రికెటర్ అయ్యి ఉండకపోతే ఇప్పటికి కూడా రోడ్ల మీద బాటిల్స్ ఏరుకుంటూ ఉండేవాడిని అని చెప్పుకొచ్చాడు.
Image result for క్రిస్ గేల్…
 1. డేవిడ్ వార్నర్…
  ఇతను ఆస్ట్రేలియా క్రికెటర్. ఇతను కూడా ఒక పవర్ ఫుల్ క్రికెటర్. డేవిడ్ వార్నర్ కూడా చిన్నప్పుడు ఎంతో పేదరికాన్ని అనుభవించాడు. చిన్నప్పుడు ఒకే గది ఉన్న ఇంట్లో నివసించేవాడు. చిన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఒక షాప్ లో హెల్పర్ గా పనిచేసేవాడు. క్రికెట్ అంటే ఏంటో ఇష్టం. అందుకే ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ కు వెళ్లి తర్వాత షాప్ లో పనికి వెళ్ళేవాడు. ఇలా బతికిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఎక్కువ డబ్బు తీసుకుంటున్న క్రికెటర్.
Image result for డేవిడ్ వార్నర్
 1. రోహిత్ శర్మ..
  రోహిత్ శర్మ ఒక ఇండియన్ క్రికెటర్. ఇండియా వైస్ కెప్టెన్ కూడా. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాట్స్ మెన్ గా ఉన్న రోహిత్ శర్మ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. ముంబైలో ఒక వీధిలో ఒక చిన్న రూమ్ లో ఇతని కుటుంబం గడిపేది. ఇంట్లో పరిస్థితుల వలన హాస్టల్ లో ఉండి చదువుకున్నాడు. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులను చూడటానికి వచ్చేవాడు. అలంటి రోహిత్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రికెటర్ అయ్యాడు.
Image result for రోహిత్ శర్మ.
 1. ధోని..
  మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికి తెలుసు. ఇండియన్ క్రికెట్ టీమ్ ను తారాస్థాయికి తీసుకెళ్లిన గొప్ప కెప్టెన్. ఇండియాలో ఎక్కడ ఉందొ కూడా తెలియని రాంచీ అనే చిన్న పట్టణం నుంచి వచ్చి ఇండియన్ క్రికెట్ టీమ్ ను శాసించే స్థాయికి వచ్చాడు. ధోని కుటుంబం కూడా చాలా పేదరికంలో బతికేది. ధోని రైల్వే టికెటర్ గా కూడా జాబ్ చేశాడు. జాబ్ చేస్తూనే క్రికెట్ మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు.

ఈ క్రింద వీడియో చూడండి

వీల్లేనండీ ఒకప్పుడు పేదరికంలో బతికి ఇప్పుడు కోట్లకు అధిపతులు అయినా క్రికెటర్స్. మరి ఈ క్రికెటర్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.