ఈ ఆవులను చూస్తే మతిపోవడం ఖాయం..

558

ఆవు పాలు తాగితే మనకు ఎంతో మంచిదని తెలుసు. ఆవు పాలు తల్లి పాలతో సమానం అంటారు. అలాగే మన హిందూ సంప్రదాయంలో ఆవుకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆవును దేవుడిగా భావించి కొలుస్తారు. అయితే మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల ఆవులను చూసి ఉంటారు. కానీ మీరు ఇప్పటివరకు కూడా చూడని కొన్ని రకాల ఆవు జాతులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి కొన్ని రకాల ఆవుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for cannulated cow
 1. కేన్యులేటెడ్ కౌ…
  ఇది చాలా వింతైన ఆవు. ఈ ఆవుకు కడుపును కోసి ఆ భాగంలో ఒక పైపులాంటిది పెడతారు. దీనిని కేన్యులా అని అంటారు. ఇలాంటి ఆవులను మనం స్వీడన్, హాలండ్ లో చూడవచ్చు. ఇలా కడుపుకు హోల్ ఉండటం వలన దానికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు అని చాలామంది అనుకుంటారు కానీ ఎలాంటి సమస్య ఉండదు. అన్ని ఆవులు ఎలా అయితే జీవిస్తాయి ఇవి కూడా అలాగే జీవిస్తాయి. ఈ ఆవులను చూడగానే వీటికి సర్జరీ చేశారేమో అందుకే ఇలా ఉన్నాయేమో అని అనుకుంటారు. కానీ ఎలాంటి సర్జరీ చెయ్యలేదు. ఈ హోల్ ఎందుకంటే..ఈ ఆవులను పెంచేది పాలకోసం. ఆ పాలు చాలా క్వాలిటీగా కావాలి. అందుకు ఆవుకు మంచి ఆహారం పెట్టాలి. మంచి మంచి విటమిన్స్,ప్రోటీన్స్ అందించాలి. అప్పుడే అదిమంచి రుచికరమైన పౌష్టిక పాలను అందిస్తుంది. అందుకే జ్యుయలజి సైంటిస్టులు అది తీసుకున్న ఆహారాన్ని ఇలా హోల్ ద్వారా బయటకు తీసి ఆ ఆహారం మీద టెస్ట్ చేస్తారు. దాంతో ఆ ఆవుకు ఇంకా ఏమైనా మంచి ఆహారం పెట్టాలా అనే విషయం ఈజీగా తెలుస్తుంది. దీంతో ఆవు ఆరోగ్యంగా ఉండి రుచికరమైన పాలను అందిస్తుంది. అలాగే ఆవు ఏదైనా చెత్తనుగాని ప్లాస్టిక్ ను గాని తింటే దానిని తీసెయ్యొచ్చు.
Image result for cannulated cow
 1. నిక్కర్స్….
  ఆవులకు రాజు ఎలా ఉంటాడో ఎప్పుడైనా చూశారా.. చూడకపోతే ఇప్పుడు చుడండి. దీని పేరు నిక్కర్స్. ఇది ఆవు కాదు ఎద్దు. ఇది 2018 లో ఇంటర్ నెట్ లో సెన్సేషన్ గా మారింది. దీని బరువు చూస్తే వామ్మో అనాల్సిందే. 1,400 కేజీలు ఉంటుంది. పొడవు 194 సెంమీ.. 2019 నాటికీ దీని వయసు 8 ఏళ్ళు. ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ ఎద్దు హోల్ సైన్ ఫ్రిసియన్ అనే జాతికి చెందినది. దీని జాతి జంతువులూ అన్ని 145 సెంమీ ఉంటె ఇది మాత్రం 194 సెంమీ ఉంది. ఇది రోజుకు 178 లీటర్ల నీటిని తాగుతుంది.
 2. లేజీ జెస్ బ్లూ గ్రాస్…
  ప్రపంచంలోనే అతి పొడవైన కొమ్ములు ఉన్న ఎద్దు ఇదే. ప్రపంచంలోనే ఏ ఎద్దుకు కూడా ఇంత పొడవైన కొమ్ములు లేవు. ఈ ఎద్దు 2012 లో పొడవైన కొమ్ముల గల ఎద్దుగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. దాని కొమ్ముల పొడవు 296 సెంమీ. ఈ జాతి జంతువుకు లేని జీన్స్ కేవలం ఈ జాతి ఎద్దుకు మాత్రమే ఉంది. ఈ జీన్స్ ప్రభావం దానికి తాతముత్తాతల నుంచి వచ్చింది. ఈ ఎద్దు తల్లికి, ఆ తల్లికి తల్లి అయినా ఎద్దుకు ఇలాగే పొడవైన కొమ్ములు ఉన్నాయి. ఈ ఎద్దులకు అమెరికాలోని గ్రీన్ లీవ్స్ సిటీలో చూడవచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి

 1. బ్లూ బెల్జియమ్ ఆవు…
  మనం జిమ్ కు వెళ్లి కండలు పెంచుకునేవాళ్లను చూస్తూనే ఉంటాం. అలాగే ఆవులు జిమ్ కు వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా.. అలా జిమ్ బాడీ ఉన్న ఆవులను బ్లూ బెల్జియమ్ ఆవులు అంటారు. వీటిని మనం బెల్జియంలో చూడవచ్చు. ఇవి ఇలా కండలు తిరిగేలా ఉండటానికి ఎలాంటి మందులు, స్టెరాయిడ్స్ ఇవ్వలేదు. ఇవి సహజసిద్ధంగా వచ్సిన కండలే. మయాస్టార్టిన్ అనే ప్రోటీన్ లేకపోవడం వలన ఇలా భారీగా తయారవుతుంది. ఈ సమస్యను 1880 లో ముందు కనిపెట్టారు. అప్పటినుంచి ఆ ఆవుల జీన్స్ మిగతా తరాలకు కంటిన్యూ అవుతూ వచ్చింది.
 2. మాణిక్యం…
  ఇది ప్రపంచంలోనే అతిచిన్న ఆవు. దీని ఎత్తు 61 సెంమీ. బరువు 40 కేజీలు. ఇది చూడటానికి దూడలాగా ఉన్నా దీని వయసు 6 ఏళ్ళు. ఈ ఆవు కేరళలో ఉంది. ఇంత చిన్న ఆవును ఎప్పుడు చూడలేదని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి దీనితో ఫోటోలు కూడా దిగుతారు. దాంతో ఈ ఆవు సెలెబ్రిటీ అయిపోయింది. ప్రపంచంలోనే చిన్న ఆవుగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటుచేసుకుంది.