ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో Btech అమ్మాయి ప్రేమ.. చివరికి?

656

ప్రేమ వ్యామోహం వెర‌సీ వారి జీవితాలు నాశ‌నం చేసుకునే వ‌ర‌కూ తీసుకువెళుతుంది. ప్రేమ‌లో ఉంటే ఎవ‌రి మాట‌లు ప‌ట్టించుకోరు.. అందులో మునిగితేలిపోతారు.. కొంద‌రు అయితే పెళ్లి అయిన వారిని ప్రేమించి వారితో రిలేషన్ పెట్టుకుంటారు.. ఇక బాగా ప్రేమ‌లో మునిగిపోతే రెండో భార్య‌గా వెళ్లేందుకు కూడా రెడీ అవుతారు…. అలాగే త‌మ ప్రేమ‌కు అడ్డు ఎవ‌రు వ‌చ్చినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకునే వారు ఉంటారు..ఇక ఇలాగే ఓ బీటెక్ యువ‌తి త‌న‌కు ల‌వ్ చేయ‌డానికి ఎవ‌రూ దొర‌క‌న‌ట్టు, ఓ పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న వ్య‌క్తిని ప్రేమించింది.. చివ‌ర‌కు వారి లైఫ్ ఏమైందో ఈ వీడియోలో తెలుసుకోండి.

ఏలూరుకు చెందిన బీటెక్ చ‌దువుతున్న విద్యార్ధినికి ఓ ఆటో డ్రైవ‌ర్ ప‌రిచ‌యం అయ్యాడు.. ఆమె ఏలూరు నుంచి విజ‌య‌వాడ రోజూ గ్రూప్స్ కోచింగ్ కు వ‌స్తొంది ఈ స‌మ‌యంలో ఆటో డ్రైవ‌ర్ తో ఆమెకు ప‌రిచ‌యం పెరిగింది… ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. అయితే త‌న‌కు పెళ్లి అయింది అని ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు అనే విష‌యం ఆమెకు చెప్పాడో లేదో తెలియ‌దు కాని ఇద్ద‌రూ గాఢంగా ప్రేమించుకున్నారు.. వారి ప్రేమ ఇంట్లో చెబితే పెద్ద‌లు ఒప్పుకుంటారో లేదో అనే డైల‌మా ఆ అమ్మాయికి మ‌రింత పెరిగిపోయింది… చివ‌ర‌కు గ్రూప్స్ కోచింగ్ ఎలా ఉన్నా ఆ ఆటో డ్రైవ‌ర్ తో ప్రేమ కోచింగ్ తీసుకుంది… చివ‌ర‌కు ఓ వారం నుంచి ఆమె క‌నిపించ‌లేదు దీంతో ఆమె త‌ల్లి దండ్రుల‌కు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు..

కాని ఇక్క‌డే అస‌లు క‌థ జ‌రిగింది.. ఆమె ఆ ఆటో డ్రైవ‌ర్ తో వెళ్లిపోయింది.. ఇంట్లో ఎవ‌రికి ఈ విష‌యం తెలియ‌నివ్వ‌లేదు.. చివ‌ర‌కు ఆమెను ఓ లాడ్జీకి తీసుకువెళ్లాడు ఆ ఆటో డ్రైవ‌ర్.. ఆమెతో క‌లిసి రోజంతా రూమ్ లో ఉన్నాడు. చివ‌ర‌కు ఏమైందో తెలియదు కాని ఇద్దరూ ఉరివేసుకుని లాడ్జ్ లో శ‌వాలుగా మారారు. అయితే హోట‌ల్ సిబ్బంది కూడా రెండు రోజుల నుంచి వీరు బ‌య‌ట‌కు రావ‌డం లేదు అని గ‌మ‌నించారు.. చివ‌ర‌కు దుర్వాస‌న రావ‌డంతో పోలీసులు రావ‌డం జ‌రిగింది.. ఇద్ద‌రూ ఉరివేసుకుని చ‌నిపోయి ఉన్నారు. చివ‌ర‌కు అత‌ని భార్య త‌న భ‌ర్త ఎందుకు చ‌నిపోయాడా అని షాక్ కు గురైంది.. ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌స్తుంద‌ని కోచింగ్ కు పంపిస్తే ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపి త‌న జీవితాన్ని అర్ధాంత‌రంగా ముగించుకుంది అని ఆమె కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అయ్యారు.

మొత్తానికి ఇంట్లో ఈ పెళ్లైన వ్య‌క్తితో ప్రేమ అని చెబితే ఏమవుతుందో అని ఆమె ఉరివేసుకుందా లేదా ఇద్ద‌రూ త‌మ ప్రేమ‌ను సాధించుకోలేక‌పోయామ‌ని మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారా అనేది పోలీసుల విచార‌ణ‌లో తేల‌నుంది.. ఇంతదారుణం జ‌ర‌గ‌డంతో పోలీసులు స్ధానికులు కూడా షాక్ అయ్యారు… చూశారుగా కొందరు అమ్మాయిలు కొన్నిఅనాలోచిత‌ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల వారి జీవితాలు ఇలా మ‌లుపు తీసుకుంటాయి.. వీరి దారుణ‌మైన ల‌వ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.