అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..

518

మెలానియా ట్రంప్..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్యగానే మనకు తెలుసు. అయితే మెలానియా ట్రంప్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మోడలింగ్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె అమెరికా ప్రథమ పౌరురాలు అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఆమె అమెరికా దేశానికి చెందిన మహిళనే కాదు. ఆశ్చర్యకరంగా ఉందా కానీ ఇది నిజం. ఈ వీడియోలో ఆమె గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

Image result for మెలానియా ట్రంప్
  • మెలానియా ఏప్రిల్ 26, 1970 న స్లోవేనియాలోని నోవో మెస్టోలో జన్మించారు.ఆమె తండ్రి, విక్టర్ నావ్స్ మోటారుసైకిల్ డీలర్‌షిప్‌లను నిర్వహించేవారు. ఆమె తల్లి అమాలిజా చిన్న పిల్లల బట్టలకు మాను ఫ్యాక్చరింగ్ చేసేది.
  • మెలానియా 1996 లో స్లోవేనియా నుండి యునైటెడ్ స్టేట్స్ కు వచ్చారు. విసిటింగ్ వీసాపై U.S. లో నివసించారు. తరువాత H-1B వర్క్ వీసాలు పొందారు. మెలానియా 2006 లో అమెరికా పౌరసత్వాన్ని పొందారు.
  • ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ప్రారంభించింది. 16 ఏళ్ల వయసులో స్లోవేనియన్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ స్టాన్ జెర్కో కోసం మొదటి ఫోటో షూట్ ఇచ్చింది. అయితే అప్పుడు ఆమె పేరు “నావ్స్”. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మెలానియా గా మార్చుకుంది. 18 ఏళ్ల వయసులో, ఇటలీలోని మిలన్‌లో ఒక మోడలింగ్ ఏజెన్సీతో సంతకం చేసింది.1992 లో, లుబ్బ్జానాలో జరిగిన జానా మ్యాగజైన్ “లుక్ ఆఫ్ ది ఇయర్” పోటీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. తరువాత అంతర్జాతీయ మోడలింగ్ కాంటాక్ట్ ను సంతకం చేసింది. మెలానియా అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకరు. టాప్ మ్యాగజైన్‌లలో అనేక ఫోటో షూట్‌లను ఆమె చేసింది.

ఈ క్రింద వీడియో చూడండి

  • 2000 లో మెలానియా డైమండ్ జువెల్లరీ కోసం GQ మ్యాగజైన్ మీద నగ్నంగా ఫోటో షూట్ చేసింది.
  • సెప్టెంబర్ 1998 లో ఒక పార్టీలో డోనాల్డ్ ట్రంప్‌ను కలిసింది. అప్పుడు ఇద్దరు డేటింగ్ ప్రారంభించారు. ట్రంప్ తన రెండవ భార్య మార్లా మాపుల్స్‌ను విడాకులు ఇచ్చి మెలానియా ను పెళ్లి చేసుకున్నారు. 2004 లో నిశ్చితార్థం చేసుకుని, జనవరి 22, 2005 న, ఫ్లోరిడాలోని ఎపిస్కోపల్ చర్చ్‌లో వివాహం చేసుకున్నారు.
  • వైట్ హౌస్ లో ఆమె సీక్రెట్ సర్వీస్ కోడ్ పేరు “మ్యూస్” .
  • జనవరి 20, 2017 న యునైటెడ్ స్టేట్స్ యొక్క ఫస్ట్ లేడి గా ఎంపికైంది. జూన్ 11, 2017 న వాషింగ్టన్, డి.సి.లోని వైట్ హౌస్ లో అడుగుపెట్టారు.
  • ఈమె తండ్రి ఒక దేశానికి , తల్లి ఒక దేశానికి చెందిన వాళ్ళు. ఆమె తండ్రి మేరీ ల్యాండ్ కు చెందినవాడు, తల్లి అమెరికాకు చెందినది. ఇలా రెండు దేశాల వ్యక్తులకు పుట్టిన మహిళ అమెరికా ప్రథమ మహిళగా ఎన్నికవడం అది రెండవసారి మాత్రమే. అంతకముందు 1775 లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూయిసా ఆడమ్స్ మాత్రమే ఇలా రెండు దేశాలకు చెందిన వ్యక్తులకు జన్మించింది.
  • 2016 లో ఫైనాన్షియల్ లెక్కల ప్రకారం, ఆమె వ్యాపారాల విలువ 15,000 నుంచి 50,000 డాలర్లు.