అణ్వాయుధాలను ప్రయోగించేందుకు భారత్ పక్కా స్కెచ్ టెన్షన్ లో పాక్

31

అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న విధానాన్నే భారత్ ఇప్పటికీ పాటిస్తోందని, అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అన్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని భారత్ సవరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధ వినియోగం విషయంలో భారత రక్షణ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Image result for army

భారత్‌, పాక్ రెండూ అణ్వస్త్ర దేశాలే. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు, విధానాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి కూడా ఉంటుంది. విధానపరంగా భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా, అంతర్జాతీయంగా ప్రతిచర్యలు ఎదురుకావొచ్చు. రాజ్‌నాథ్ వ్యాఖ్యల గురించి రక్షణ వ్యవహారాల నిపుణుడు రాహుల్ బేదీ మీడియాతో మాట్లాడారు. రాబోయే కాలంలో ప్రతిచర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి, ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం బాగా ఆలోచించే తీసుకుంటుందని ఆయన అన్నారు.

Image result for army

ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అణ్వాయుధాలు మొదట ఉపయోగించకూడదన్న విధానం సరికాదని, దానిలో మార్పులు తేవాలని కోరుకుంటున్నానని అన్నారు. అయితే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. రాజ్‌నాథ్ మాత్రం ఇప్పుడు రక్షణ మంత్రి హోదాలోనే ఈ విషయం గురించి మాట్లాడారు. ఈ అంశంపై బీజేపీ సర్కారులో చర్చోపచర్చలు జరుగుతున్నాయడానికి దీన్ని సంకేతంగా భావించొచ్చు. 1998లో భారత్ ఫోఖ్రాన్‌లో అణ్వాయుధ పరీక్షలు జరిపినప్పుడు, అప్పుడు ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్‌కు లేఖ రాశారు. చైనాను ఎదుర్కొనేందుకే తాము ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
ఈ లేఖ బయటకు పొక్కి, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో అచ్చైంది. దీనిపై పెద్ద దుమారమే రేగింది.

ఈ క్రింద వీడియో చూడండి

అందరి కన్నా ముందు పాకిస్తాన్, చైనా స్పందిస్తాయి. ఎందుకంటే, భారత్‌తో ఈ రెండు దేశాలూ సరిహద్దులు పంచుకుంటున్నాయి. పైగా మూడు దేశాలకూ అణ్వాయుధాలున్నాయి. పాకిస్తాన్‌తో, చైనాతో భారత్‌కు సరిహద్దు వివాదాలున్నాయి. అందుకే, విధాన మార్పు చాలా తీవ్రమైన అంశమే అవుతుంది. అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న విధానాన్ని ‘రీటాలియెట్రీ డాక్ట్రిన్ (ప్రతిచర్య సిద్ధాంతం)’ అంటారు. అంటే, తమపై ఇతరులు అణ్వాయుధ దాడి చేసిన తర్వాతే, భారత్ తిరిగి ‌అణ్వాయుధాలతో ప్రతిస్పందిస్తుంది. ఇలాంటి విధానాలపై చాలా చర్చించే నిర్ణయం తీసుకుంటారు. వాజ్‌పేయి వర్ధంతికి నివాళులు అర్పిస్తూ రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా సంకేతం పంపాలన్న ఉద్దేశం ఉండుండొచ్చు.అయితే పాక్ ముందు కవ్వింపు చర్యలకు పాల్పడితే మ్యాప్ లో లేకుండా చేసేలా భారత్ చర్యలు ఉంటాయి అనేది అంతర్జాతీయంగా పాక్ కు సలహా వస్తోంది, కాని పాక్ మాత్రం భారత్ ని అటాక్ చేయాలని చూస్తోంది, అందుకే భారత్ పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్లాలని చూస్తోంది, దీంతో నిన్నటి నుంచి పాక్ కు టెన్షణ్ పట్టుకుందట భారత్ స్టెప్ ఎలా ఉంటుందో అనే ఆలోచనలో మరో పక్క యూఎన్ వోలో కూడా పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది అనే విషయం తెలిసిందే.