వైసీపీ ఎమ్మెల్యే రోజా అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు చూస్తే షాకవ్వాల్సిందే

357

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున డైన‌మిక్ లేడీ లీడ‌ర్, ఆర్కే రోజా న‌గ‌రి నుంచి ఎమ్మెల్యేగా మ‌రోసారి పోటీ చేస్తున్నారు.. నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రోజా.. ఈ నెల 22న నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఆమెకు కార్లు అంటే చాలా ఇష్టమని అఫిడవిట్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఆమెకు దాదాపు కోటి రూపాయలకు పైగానే విలువ చేసే ఏడు కార్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా భర్త శెల్వమణి పేరిట స్థిరాస్తి ఏమీ లేదని వెల్లడించారు. తనకు సుమారు రూ.50 లక్షల అప్పులు ఉన్నాయనీ, కొడుకు, కూతురి పేరిట మరో రూ.50 లక్షల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. మ‌రి ఆమె ఆస్తులు చూద్దాం.

నగరి వైసీపీ అభ్యర్థి రోజా పేరిట ఉన్న ఆస్తులు:
రోజా పేరిట ఉన్న మొత్తం ఆస్తి: రూ.7కోట్ల రూపాయ‌లు
స్థిరాస్తి మొత్తం : రూ.4, కోట్ల 64 ల‌క్షల రూపాయ‌లు
చరాస్తి మొత్తం : రూ. 2,కోట్ల 74 ల‌క్ష‌ల రూపాయ‌లు
అప్పులు : 50 ల‌క్ష‌ల రూపాయ‌లు
వాహనాలు: మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో ఉన్నాయి. వీటి విలువ రూ.కోటి ప‌దిల‌క్ష‌ల రూపాయ‌లు అని తెలుస్తోంది.
2017-18లో ఆదాయ పన్ను శాఖకు చెల్లించిన మొత్తం : రూ.52 ల‌క్ష‌ల రూపాయ‌లు.

Image result for mla roja

భర్త సెల్వమణి పేరుతో ఉన్న ఆస్తులు
స్థిరాస్తి మొత్తం : లేదు
చరాస్తి మొత్తం : రూ.58,ల‌క్ష‌లు
అప్పులు : రూ.22 ల‌క్ష‌లు
వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58 ల‌క్ష‌లు
2017-18లో ఆదాయ పన్ను శాఖకు చెల్లించిన మొత్తం : రూ.3,94,518

Image result for mla roja

కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్‌ పేరుతో ఉన్న ఆస్తుల విలువ: రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌లుగా అఫిడ‌విట్లో దాఖ‌లు చేశారు. మ‌రి చూశారుగా ఆమె ఎన్నిక‌ల క‌మిష‌న్ కు స‌మ‌ర్పించిన ఆస్తుల అఫిడ‌విట్ మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.