యాదాద్రి సొరంగాల్లో వ్య‌భిచారం చేస్తున్న అమ్మాయిలను ఎక్కడ దాచారో చూసి షాకైన పోలీసులు

549

రాచ‌కొండ పోలీసులు యాదాద్రిలో వ్య‌భిచారం చేసే వారిని త‌రిమేవ‌ర‌కూ విశ్ర‌మించేలా లేరు… ఇప్ప‌టికే ఇక్క‌డ లాడ్జీల‌లో కాని ఇళ్ల‌లోకాని వ్య‌భిచారం చేస్తే కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఆ ఇంటిని సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.. అయితే లాడ్జీలు మాత్రం కాస్త ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గాయి.. ఇక్క‌డ లాడ్జీల‌కు వ‌చ్చే అమ్మాయిలు అబ్బాయిలుకు రూమ్స్ ఇవ్వ‌డం లేదు.. ఇక గుట్ట కింద ప్రాంతంలో పోలీసులు మ‌ఫ్తీలో తిరుగుతూ బ‌య‌ట అమ్మాయిల‌ను నిల‌బెట్టి వ్య‌భిచారం చేయిస్తున్నారా అని చూస్తున్నారు… మ‌ళ్లీ ఇలా సీక్రెట్ గా సొరంగాల ఇళ్ల‌ల్లో వ్య‌భిచార చేస్తూ దొరికిపోయింది ఓ ముఠా.

అభం..శుభం తెలియని చిన్నారులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఎత్తుకువచ్చి.. వారిని పెంచి పెద్దచేసి.. వ్యభిచార కూపంలో దించుతున్నారు ఇక్క‌డ గ్యాంగ్… యాదగిరిగుట్ట పట్టణంలోని వ్యభిచార గృహాలపై పోలీసుల మ‌ళ్లీ దాడులు చేశారు.. పట్టణంలోని మూడు ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలపై సాయంత్రం రాచకొండ పోలీసులు జరిపిన దాడుల్లో మరో ఇద్దరు బాలికలకు విముక్తి కల్పించారు. ఓ వ్యభిచార నిర్వాహకురాలిని అరెస్టు చేసిన పోలీసులు.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడు గృహాలను రెవెన్యూ అధికారుల ఉత్తర్వుల మేరకు సీజ్‌ చేశారు.

గుట్ట కింద వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించగా అమాయక యువతులతో వ్యభిచారం చేయిస్తున్న కంసాని జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ద‌గ్గ‌ర ఇరువురు బాలికలను గుర్తించారు. పేదకుటుంబాలకు చెందిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులకు ఆశలు కల్పించి వారి నుంచి కంసాని శంకర్‌ అనే వ్యక్తి తీసుకువచ్చి రూ.40వేలకు అప్పగించాడని పోలీసుల విచారణలో ఆమె తెలిపింది… దీంతో ఆ ఇద్దరు బాలికలను వ్యభిచారగృహ నిర్వాహకుల నుంచి రక్షించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. త‌ర్వాత కంసాని జ్యోతిని అరెస్టు చేసి కోర్టులో రిమాండ్‌ చేశారు.

ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా పోలీసులు జరిపిన దాడుల్లో వ్యభిచార గృహాల నిర్వాహకుల నిర్భంధంలో ఉన్న 26 మంది బాలికలను రక్షించి నల్లగొండ, మహాబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. అదే విధంగా 25 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిలో కంసాని శంకర్‌తో పాటు మరో నలుగురిపై ఇప్పటికే పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. మిగతా 20 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులపై కూడా పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాచకొండ పోలీసులు తెలియ‌చేశారు… ప్ర‌తీ వారం ఇక్క‌డ సోదాలు దాడులు జ‌రుగుతాయ‌ని, ఇక్క‌డ వీరు ఇటువంటి అనైతిక కార్య‌క‌లాపాలు మానేవ‌రకూ తాము విశ్ర‌మించ‌ము అని చెబుతున్నారు పోలీసులు… దీనిపై స్ధానికులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.