జగన్ పై హత్యాయత్నం కేసులో షాకింగ్ ట్విస్ట్ శ్రీనివాసరావుని క‌లిసిన టీడీపీ ప్ర‌ముఖ నేత

192

ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందాలకు వినియోగించే చిన్నపాటి కత్తితో హత్యా యత్నానానికి పాల్పడిన ఘటన ఎంతటి సంచలనానికి దారి తీసిందో అందరికీ తెలుసు.అయితే ఆ సమయంలో దీనిపై తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీల మధ్య పెద్ద ఎత్తునే రగడ నడించింది.నిజానికి ఎప్పుడో తేలిపోవాల్సిన ఈ కేసు అసలు ఏం జరుగుతుందో కూడా తెలీని మిస్టరీగా రాజకీయ వర్గాల్లో మిగిలిపోయింది.

Image result for kodi kathi

సిట్ విచారణ వేస్తామని టీడీపీ అంటే నమ్మకం లేదని ఎన్ ఐ ఏ కు ఈ కేసును అప్పగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేసారు.అయినా సరే అతడు జగన్ను చంపడానికి ఎందుకు వచ్చాడో ఎవరు పంపితే వచ్చాడో అన్నది ఇప్పటి వరకు తెలీలేదు.కానీ ఇప్పుడు ఈ కేసులో కొన్ని షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రశ్నార్ధకంగా మారాయి.ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసరావు రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.కానీ ఈ రెండు రోజుల్లనే అతని ఆరోగ్యం బాగోలేదని చెప్పి అక్కడి ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రింది వీడియో చూడండి

కానీ ఈ విషయం మాత్రం గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నించారు.కానీ ఎలాగో బయటకు వచ్చేసింది.అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.నిజానికి అతన్ని అడ్మిట్ చేసిన తర్వాత అక్కడి గదిలోకి ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు వచ్చి చాలా సేపు రహస్య మంతనాలు చేసారని ఇక్కడే మరో ట్విస్ట్ ఏమిటంటే అక్కడున్న అన్ని గదుల్లోను సీసీ కెమెరాలు ఉంటే ఒక్క శ్రీనివాసరావు ఉన్న ఐసీయూ గదికి మాత్రం లేకపోవడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్ర‌ముఖ నేత కూడా చ‌ర్చ జ‌రిపారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి అందుకే సీసీ కెమెరాలు ప‌నిచేయ‌డం లేద‌ని అక్క‌డ‌కు వ‌చ్చింది ఎవ‌రో తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు అని అంటున్నారు వైసీపీ నేత‌లు.

Image result for kodi kathi

అసలు ఈ కేసు విషయాన్ని ఓ పక్క పోలీసులు మరియు వైద్యులు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచడంతో ఏదో కుట్ర జరుగుతుంది అని అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మ‌రో ప‌క్క ఎన్నిక‌ల్లో ఈసారి వైసీపీ అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా ఈ కేసును చాలా సీరియ‌స్ గా తీసుకుంటుంది అని, అందుకే ఇలాంటి ఎత్తుగ‌డ‌లు అధికార పార్టీ వేస్తోందా అంటున్నారు మొత్తానికి ఈ కేసు విష‌యంలో ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి, ఇంకా ఎంత‌కూ ఈ కేసు విచార‌ణ తేల‌క‌పోవ‌డంతో ఆశ్చ‌ర్యం అలాగే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి, మ‌రో వైపు వైసీపీ అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి కేసుని కేంద్ర ద‌ర్యాప్తు సంస్ధ‌కు ఇస్తారు అని అంటున్నారు వైసీపీ శ్రేణులు. మ‌రి చూడాలి ఈ కేసు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.