పెళ్ళైన వారం రోజులకే షాకింగ్ కామెంట్స్ చేసిన స్వాతి నాయుడు భర్త అవినాష్..

531

యూట్యూబ్ శృంగార తార స్వాతినాయుడు ఇటీవల అవినాష్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు-అవినాష్ తమ రిలేషన్ ఎలా మొదలైంది? పెళ్లి సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు తదితర విషయాలు వెల్లడించారు. అవినాష్ తల్లిదండ్రులకు నా గురించి, నేను చేస్తున్న రొమాంటిక్ వీడియోల గురించి తెలుసు. నేను స్వయంగా వెళ్లి వారితో మా పెళ్లి గురించి మాట్లాడారు. ఒప్పుకోలేదు. నా ప్రొఫెషన్, నేను చేస్తున్న వీడియోలు వారికి నచ్చలేదు. చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు. నాకు తప్ప ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమే అన్నారు. అందుకే వారిని కాదనుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి విషయం మా నాన్నకు చెబితే మీకు మీరు ఎలా డిసైడ్ అవుతారు? అబ్బాయి తరుపువారు కూడా ఒప్పుకోవాలిగా అన్నారు. మా నాన్న స్వయంగా వెళ్లి అవినాష్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అయినా వారు ఒప్పుకోలేదు. మీ అమ్మాయి గురించి మీకు తెలియదా? అలాంటి అమ్మాయికి మా అబ్బాయిని ఎలా ఇస్తాం? అంటూ నెగెటివ్‌గా మాట్లాడి ఫైనల్ గా నో చెప్పారు. అవినాష్ పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పడంతో అతడి తల్లిదండ్రులు మరింత సీరియస్ అయ్యారు. మాకు కొడుకులేడు, నువ్వు చచ్చిపోయావ్ అనుకుంటాం, నీ జీవితంతో మాకు సంబంధం లేదని చెప్పి పొమ్మన్నారు. వారు అలా చెప్పడంతో మేము ధైర్యంగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం.

Image result for swathi naidu and husband

మా పెళ్లి విజయవాడలో జరిగింది. పెళ్లైన తర్వాత హనీమూన్ అక్కడే నాలుగు రోజులు గడిపాం. షూటింగ్స్ ఉండటంతో హైదరాబాద్ వచ్చేశాం. శోభనం పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. పెళ్లికి ముందు సీక్రెట్ గా జరిగేది. పెళ్లి తర్వాత పెద్దలందరూ కలిసి గదిలోకి పంపడం కాస్త సిగ్గుగా అనిపించిందని… స్వాతి నాయుడు తెలిపారు. ఇక స్వాతినాయుడిని పెళ్లి చేసుకున్న అవినాష్ మాట్లాడుతూ… స్వాతి నాయుడును పెళ్లి చేసుకోవడంతో నాపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తాయని తెలుసు. అన్నింటికీ సిద్దపడే పెళ్లి చేసుకున్నాను. అందుకే బాధ పడటం లేదు, వాటిని అసలు నేను పట్టించుకోను. స్వాతి కోసం నేను నా ఫ్యామిలీని వదిలేసుకున్నాను. హ్యాపీగా ఉన్నాను. సమాజం ఏమంటుందనే విషయం నేను పట్టించుకోను.. పెళ్లి తర్వాత స్నేహితులు కూడా దూరం పెట్టారు. వారు స్వాతికి కూడా ఫ్రెండ్సే… ఇపుడు మాత్రం స్వాతిని వదిలేయ్ అంటున్నారు. మొదట మేమిద్దరం ఫ్రెండ్స్‌గా ఉండేవారం. తర్వాత మా స్నేహం రిలేషన్‌షిప్‌లా మారింది. సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం అనిపించింది. ఆమె వీడియోల్లో, సినిమాల్లో ఏం చేసిన కెమెరా ముందు చేస్తుంది. ఇదంతా తన కెరీర్ కోసం చేస్తుంది. కెమెరా వెనక ఏమీ చేయదు. తనది ఎంతో మంచి మనసు. అందుకే నచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకుంటే బ్యాచిలర్ లైఫ్ పోయిందనే భయం ఉండేది. మేము ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టి భయం అనిపించలేదు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ దూరం అయ్యారనే ఫీలింగ్ అయితే ఉంది. స్వాతి నాకు దక్కింది అనే హ్యాపీనెస్ ఉంది కానీ ఎక్కడో ఫ్యామిలీ లేదనే బాధ కూడా ఉంది.. పెళ్లికి ముందు రోజు మా తమ్మడు ఫోన్ చేసి దమ్కీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. గోల్డ్, క్యాష్ ఎత్తుకెళ్లినట్లు సీన్ క్రియేట్ చేశారు. నేను ఇంట్లో నుంచి వచ్చి రెండు నెలలైంది. అప్పటి నుంచి లేనిది ఇప్పుడెలా పోయాయి అని గట్టిగా అడగటంతో సైలెంట్ అయిపోయారు. నాకు కట్నం తీసుకోవడం నచ్చదు. డబ్బును నమ్మను. డబ్బుకు విలువ ఇచ్చే వారు నాకు నచ్చరు. మనిషికి విలువ ఇచ్చేవారు మాత్రమే నచ్చుతారు. స్వాతి నాయుడు అలాంటి అమ్మాయి కాబట్టే నాకు నచ్చిందని అవినాష్ తేల్చి చెప్పారు. విన్నారుగా ఈ ప్రేమ జంట చెప్పిన విషయాల గురించి. మరి స్వాతి నాయుడు అవినాష్ ల గురించి వారు చెప్పిన వారి ప్రేమ పెళ్లి కబుర్ల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.