సవ్యసాచి సినిమా రివ్యూ అక్కినేని అభిమానులకు పండుగే

436

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సవ్యసాచి’ దీపావళి కానుకగా శుక్రవారం నాడు (నవంబర్ 2) థియేటర్స్‌లో విడుదలైంది. అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీస్ సంస్థ చైతూ కెరియర్‌లోనే అత్యధిక బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. వినూత్న కథాంశంతో ప్రేమమ్ ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ పోషించగా సీనియర్ హీరోయిన్ భూమిక కీలకపాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ‘సవ్యసాచి’ అనే డిఫరెంట్ టైటిల్‌తో సినిమా హైప్ తీసుకువచ్చిన దర్శకుడు టీజర్, ట్రైలర్‌లతో అంచనాలను రెట్టింపు చేశారు. భారీ అంచనాలతో నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

Image result for సవ్యసాచి

కథ :
విక్రమ్ ఆదిత్య అనే కుర్రాడి జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది.స్నేహితులు కాలేజీ లైఫ్ ప్రేమ కుటుంబం..ఇదే అతని జీవితం. అయితే ఇతనికి ఉన్న వీక్ నెస్ ఇతని లెఫ్ట్ హ్యాండ్.అన్యాయం జరిగిన సంతోషం వేసిన బాధ వేసిన మొదట రియాక్ట్ అయ్యేసి ఇతని హృదయం కాదు ఇతని లెఫ్ట్ హ్యాండ్.ఇతనికి ఉన్న ఈ వీక్ నెస్ వలన విలన్ మాధవన్ కు చెడు జరుగుతుంది.దాంతో ఇతని మీద కోపం పెంచుకుని కక్ష్య సాధిస్తాడు.ఆ కక్ష్య సాధింపు చర్యలో భూమికను ఆమె కూతురిని అటాక్ చేస్తాడు.మరి మాధవన్ ను హీరో విక్రమ్ ఆదిత్య ఎదుర్కొన్నాడనేదే మిగతా కథ.

Image result for సవ్యసాచి

సవ్యసాచి అద్భుతమైన కథతో రూపొందించారు. సినిమాలో మంచి వినోదం కూడా ఉంది.ఫస్టాఫ్ మొత్తం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.నాగ చైతన్య నటన బావుంది.విలన్‌గా నటించిన మాధవన్ అదరగొట్టేశాడు.సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.సెకండ్ హాఫ్ లో చైతు, మాధవన్ మధ్య సాగే కొన్ని సన్నివేశాలు మాత్రం నిరాశపరిచే విధంగా ఉన్నాయి.కాన్సెప్ట్ కొత్తగా ఉంది కాని నేరేషన్ పాతదానిలాగ అనిపిస్తుంది..ఇంటర్వెల్ సన్నివేశంతో మరోస్థాయికి తీసుకుని వెళ్లారు.సవ్యసాచి చిత్రంలో కాలేజ్ లో జరిగే ఫైట్ అదిరిపోయింది.చివరి 40 నిమిషాలు సినిమా ఉత్కంఠ భరితంగా ఉంటుంది.అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చైతూ యాక్టింగ్ ఉంది.అయితే రెగ్యులర్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందో లేదో చూడాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్లస్ పాయింట్స్…
సినిమా కథ,నాగచైతన్య నటన,మాధవన్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..డైరెక్షన్..
మైనస్ పాయింట్స్…
హీరోయిన్,అనుకున్న కాన్సప్ట్ ను అర్థం అయ్యేలా చూపించకపోవడం,కొన్ని బోరింగ్ సీన్స్,సినిమాటోగ్రఫీ,కామెడీ లేకపోవడం

ఈ సినిమాకు మేము ఇస్తున్న రివ్యూ : 3/5