రాజీనామా చేస్తా వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

385

వైసీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ పై కాకుండా సొంత పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.. ప్ర‌జారోగ్యం కాపాడ‌లేని ప్ర‌భుత్వం పై పోరాటం చేస్తుంటే ఎందుకు మాపార్టీ స‌పోర్ట్ చేయడం లేదో తెలియ‌డం లేదు అని, వైసీపీ ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర మండిపడ్డారు. మాపార్టీ నాయ‌కులు ప్ర‌తిపక్షంలో ఉండి నిద్ర‌మ‌త్తులో జోగుతున్నారు అని సొంత పార్టీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు చేశారు. ఇప్ప‌టికే ఏజెన్సీలో వ‌ర్షాలు వ‌ల్ల జ్వరాలు వ‌చ్చి ఇబ్బంది ప‌డుతున్నారు. వీటిని అరిక‌ట్ట‌డంతో అధికార పార్టీ విఫ‌లం అయింది.

Image result for ycp flag

అయితే దీనిపై ప్ర‌తిప‌క్షం మూడు రోజులుగా పోరాటం చెయ్యాలి అని అనుకుంటున్నారు.. మిన‌హా చేసింది ఏమీ లేదు.. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోక‌పోతే దీనిపై పోరాటం చేయ‌క‌పోతే తాను రాజీనామా చేస్తాను అని అన్నారు సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర‌. అధికార పార్టీ కావాలి అనే ఇక్క‌డ అభివృద్దిని ఆపింది, ఇలాంటి ప‌రిస్దితుల్లో సాయం కూడా చేయ‌డం లేదు అని నిల‌దీస్తున్నారు. సాలూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితుల‌కు ఆయ‌న అండ‌గా ఉంటాన‌ని వారికి క‌లిసి భ‌రోసా ఇచ్చారు. మీకు మంచి చికిత్స అందుతుంది అని తెలియ‌చేశారు.

Image result for ycp flag

జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీయాల్సిన మా వైసీపీ నేతలు నిద్ర మత్తులో ఉన్నారు. జిల్లాలో ఇంత మంది మరణిస్తున్నా, వాళ్లు ఒక్క మాట మాట్లాడటంలేదు.. ప్రభుత్వ వైఫల్యంపై పోరాడటంలేదు అని ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శించారు.. అయితే అధికార పార్టీపై చూపించాల్సిన కోపం ఇలా స్వ‌ప‌క్షం పై చూప‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.