నల్గొండ జిల్లా లో ఘోరం: ఓటేయడానికి వస్తూ ఒకే కుటుంబనికి చెందిన ముగ్గురు మృతి షాక్ లో MLA అభ్యర్ది

335

తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఓటు వేయ‌డానికి, త‌మ స్వ‌గ్రామాల‌కు వెళుతున్నారు. ఈ స‌మ‌యంలో కంపెనీలు తెలంగాణ వ్యాప్తంగా ఓటువేసేందుకు సెల‌వు ఇవ్వ‌డం జ‌రిగింది. అలాగే శ‌ని- ఆదివారాలు సెల‌వు కావ‌డంతో మూడు రోజులు సెల‌వుల‌తో పుట్టిన ఇంటికి పెద్దఎత్తున వెళుతున్నారు. ఇలా వెళుతున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర‌మాదానికి గురి అయింది.

అదుపుతప్పిన కారు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, అలాగే ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈప్ర‌మాదం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొలుముంతల్‌పహాడ్‌ పంచాయతీ పరిధిలోని కేశ్యతండాలో జ‌రిగింది… పెద్దఅడిశర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్‌రెడ్డి , పోగుల యాదమ్మ భార్యభర్తలు…. వీరు 5 రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న తమ కుమార్తె ఇంటికి వెళ్లారు. కుమార్తె భర్త తిప్పన వెంకట్‌రెడ్డిది పోల్కంపల్లి గ్రామమే. ఈయన పీఏపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

హైదరాబాద్‌లో నివసిస్తున్న పోల్కంపల్లి గ్రామస్థులను ఓటు వేయడానికి రావాలని చెప్పి.. అత్తమామలు యాదమ్మ, సురేందర్‌రెడ్డి, స్నేహితుడు బొడ్డుపల్లి నర్సింహాచారి, అన్న కుమారుడు మహేందర్‌రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. కేశ్యతండా వద్ద విద్యుత్తు స్తంభానికి కారు ఢీకొనడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి మార్గమధ్యంలో మరణించారు.ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు మ‌ర‌ణించ‌డంతో ఆ ఇంటి విషాదం అల‌ముకుంది… ప్ర‌చారం ఎలా ఉన్నా రాజ‌కీయంగా త‌మ‌కు స‌పోర్ట్ గా ఉన్న ఆ కుటుంబం మ‌ర‌ణించింది అని తెలిసి ఆ కీల‌క రాజ‌కీయ నేత క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఇ