ఏపికి ముంచుకొస్తున్న పెనుగండం.. ఈ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్త.. హెచ్చరించిన అధికారులు

429

ఏపీకి మ‌రో తుపాను గండం పొంచి ఉంది.. రెండు రోజుల కిందట పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి గురువారం రాత్రికి మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపానుకు దాయే అని పేరును పెట్టారు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు.. గురువారం రాత్రి 8.30 గంటల సమయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరాధ్రలోని కళింగపట్నానికి ఈశాన్యంగా 160 కిలోమీటర్ల దూరంలో దాయే కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతూ గోపాల్‌పూర్ ద‌గ్గ‌ర తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ, రాయలసీమ, తెలంగాణల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.

Image result for village rain

తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం దాటాక తుపాను వేగం మరింత పెరుగుతుందని తెలిపింది. శుక్రవారం సాయంత్రం వరకు తుపాను ప్రభావం ఉంటుందని, దాయే బలహీనపడి శనివారం నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించారు. ఒడిశా, ఉత్తరాంధ్రలపై దాయే ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో మెసెజ్‌లు జారీచేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం,విశాఖ‌, విజ‌య‌న‌గ‌రంలో తుపాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది అని అధికారులు తెలియ‌చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇక్క‌డ ప్ర‌జ‌లు కూడా త‌మ జాగ్ర్త్త‌త్త‌లు తీసుకుంటున్నారు..గుడిసెలు, విద్యుత్తు తీగలు, స్తంభాలు, రహదారులు, పంటలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని వివరించింది. అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. అలాగే కోస్తాల్లో అన్ని రేవుల వెంబడి ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. చూశారుగా తుపాను ప్ర‌భావం ఎక్కువ ఉన్న‌చోట పోలీసులు రెవెన్యూ యంత్రంగం సూచ‌న‌లు ఎప్ప‌టిక‌ప్పుడు పాటించి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోండి, ఈ తుపాను ప్ర‌భావం పై మీరు ఏమైనా స‌ల‌హాలు సూచ‌న‌లు కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.