కేరళ ఛాయ్‌వాలా వరదలో ఉన్నవారి ఆకలి ఎలా తీర్చాడో తెలిస్తే..వాడి ఐడియాకి దండం పెడతారు

435

కేరళలో వరదలు పూర్తీగా తగ్గిపోయాయి.ప్రజలు సహాయక కేంద్రాల నుంచి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.చాలా మంది ఇల్లులు కూలిపోయి నడిరోడు మీద నిలబడ్డారు.ప్రభుత్వం వారికి సహాయం చేస్తుందని హామీ ఇచ్చింది.ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే కేరళలో వరదలు ఉన్న సమయంలో ఒక విషయం జరిగింది.ఆ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లడుకుంటుంది.ఒక చాయ్ వాలను సెలెబ్రిటి చేసింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

కేరళలో ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో అందరికి తెలిసిందే. వర్షాలు, వరదలు వల్ల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దేశ ప్రజలంతా ప్రాంతీయ భేదాలు మరిచి సహాయం చేసి మనమంతా ఒక్కటే అని చాటి చూపారు. వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి పాస్తులు, ఇల్లు కోల్పోయి నిరుపేదలుగా మారారు. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.ఒకవైపు సహాయక చర్యలు నిర్వహిస్తున్న సైనికులకు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్న సమయంలో ఓ చాయ్ వాలా ఉన్న చోట నుంచి కాలు కదపకుండా వరద భాధితులకు ఛాయ్, బ్రెడ్ అందిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

గ్లాస్ లలో చాయ్ నింపి, ఓ ట్రేలో పెట్టి ఆ ట్రేను నీళ్లపై ఉంచి దూరంగా ఉన్నవాళ్ల దగ్గరకు పంపిస్తున్నాడు.అస్సలు అలసట అనేది లేకుండా అతను చాయ్ అందిస్తున్న విధానం అందరిని ఆకర్షించింది.వరద నీటిని ఉపయోగించుకొని వరద బాధితులకు సర్వీస్ చేస్తున్న అతడిని సోషల్ మీడియా మెచ్చుకుంటోంది.ముఖ్యంగా నడుం వరకు నీళ్ళు ఉన్నా కూడా అతను టీ అందిస్తున్న విధానం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.అంత వరదలలో నాకెందుకు అని అనుకోవచ్చు కానీ అతను అలా అనుకోకుండా తనవంతు సాయం చేశాడు.అందుకే అందరు అతనిని మెచ్చుకుంటున్నారు.మీరు సామాన్యులు కాదు సార్..ప్రతికూల పరిస్ధితులని కూడా మీకనుగుణంగా మార్చుకొనే టాలెంట్ మీది అంటూ అతడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే కదా ఇది.