బండ్ల గణేష్, రేవంత్ రెడ్డి లపై కవిత షాకింగ్ కామెంట్స్

267

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మీడియా ఇంటర్వ్యూల్లో తనదైన శైలి వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇంటర్వ్యూ చూస్తున్న వారిలో మాత్రమే కాదు… ఆయన్ను ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులను సైతం నవ్వించాయి. ఆయన సీరియస్‌గానే తన ఓపీనియన్స్ చెబుతున్నా… ప్రజలకు మాత్రం కామెడీ స్టైల్‌లో రీచ్ అయ్యాయి.

Image result for bandla ganesh

అయితే ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక పోతే మీరు డిసెంబర్ 11న బ్లేడు తీసుకుని రండి, ఇదే ప్లేసులో అందరి ముందు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను, గెలిస్తే మీరు నాకు స్వీట్లు ఇవ్వాలి…. అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు…. ఇక ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే బండ్ల గ‌ణేష్ ఎక్క‌డ ఉన్నాడు బ్లేడుతో మేము రెడీ మీరు రెడీనా అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. ఇక టీఆర్ఎస్ నాయ‌కులు ఎవ‌రూ దీనిపై మాట్లాడ‌లేదు.

Image result for revanth reddy
కాని తాజాగా ఎంపీ క‌విత ఈ విష‌యం పై మాట్లాడారు.. బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని ” నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎంపి కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని వారు ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగ‌క్క‌ర్లేదు అని చెప్పారు. ఇక రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాను అని చెప్పిన వారు కూడా ఆలోచించుకోవాలి అని ఆమె అన్నారు. రేవంత్ రెడ్డి ఓడిపోతే తానురాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాను అన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇక వారి ప్రగల్భాలపై విజ్ఞతను వారికే వదిలివేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత భయంకరమైన శిక్షే చాలా పెద్దదని, ప్రజలు విధించిన ఈ శిక్ష కన్నా మరో పెద్ద శిక్ష ఉండబోదని ఎద్దేవా చేశారు. ఇక గడ్డాలు పెంచుకోవడం, సన్యాసం తీసుకోవడం వారిష్టమేనని, ఇకనైనా వారి మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే, తదుపరి ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలను సాధించుకోవచ్చని కవిత సలహా ఇచ్చారు… దీంతో నిన్న‌టి నుంచి అస‌లు కనిపించ‌కుండా ఉన్న బండ్ల గ‌ణేష్ మ‌రోసారి దీనిపై స‌మాధానం చెప్ప‌డానికి అయినా మీడియా ముంద‌కు రావాలి అని అడుగుతున్నారు. మ‌రి దీనిపై టీఆర్ ఎస్ శ్రేణులు చెబుతున్న మాట‌పై మీ అభిప్రాయం తెలియ‌చేయండి.