చంద్రబాబుకు ఊహించిన షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. రాష్ట్రంలో సంచలనం

446

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇంత‌కీ తెలంగాణ ఎన్నిక‌లు ఇంకా జ‌ర‌గ‌కుండా షాక్ ఏమిటి అని అనుకుంటున్నారా ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయాలు జరుగుతున్నాయి… తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో మ‌హాకూట‌మిలో భాగంగా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌నదైన వ్యూహాల‌తో కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినికి టిక్కెట్ ఇచ్చి రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

Image result for chandra babu and jr ntr

అయితే సుహాసిని నామినేష‌న్ వేసిన‌ప్ప‌టి నుండి అక్క‌కోసం ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారానికి వ‌స్తాడంటూ ప్ర‌చారం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ‌తో పాటు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కూక‌ట్‌ప‌ల్లిలో ప్ర‌చారం చేస్తారంటూ ప‌లు క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయితే తార‌క్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ సుహాసిని కోసం ప్ర‌చారానికి వ‌చ్చే చాన్సే లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుండి ఓ వార్త బ‌య‌ట‌కి వచ్చింది. ఇక డిసెంబ‌ర్ 11 వ‌ర‌కూ చిత్ర షెడ్యూల్ ఫిక్స్ అయింది అన తెలుస్తోంది ఇటు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కు రాక‌పోతే చ‌ర‌ణ్ అలాగే సీనియ‌ర్ న‌టుల కాల్ షీట్లు వేస్ట్ అవుతాయి అని ఆయ‌న ఆలోచ‌న అని తెలుస్తోంది.

గ‌తంలో చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ని వాడుకొని, ఆ త‌ర్వాత ఎలాంటి ప్ర‌యారిటీ ఇవ్వ‌లేదు అన‌దేఇ అంద‌రికీ తెలిసిందే అని, తార‌క్ అభిమానులు అంటున్నారు. అది కూడా ఎన్టీఆర్ రాక‌పోవ‌డానికి ఓకార‌ణం అవుతుంది అని చెబుతున్నారు.. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీకి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. మ‌రోవైపు తెలంగాణ‌లో టీడీపీ పూర్తిగా తుడుచుకుపోయే ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలో సుహాసినికి టిక్కెట్ ఇచ్చి నంద‌మూరి కుటుంబాన్ని తెర‌పైకి తెచ్చారు చంద్ర‌బాబు. ఇవ‌న్నీ ఓ కంట క‌నిపెడుతున్న ఎన్టీఆర్ గ‌తంలో త‌న‌కు ఎదురైన అవ‌మానాల దృష్ట్యా ఆయ‌న మ‌రోసారి టీడీపీ త‌రుపున ప్ర‌చారంలోకి దిగే అవ‌కాశ‌మే లేద‌ని, సుహాసిని కోసం తార‌క్ ప్ర‌చారానికి వ‌చ్చే చాన్సేలేద‌ని, ఆయ‌న ద‌గ్గ‌రి స‌న్నిహితుడు తెలిపాడ‌ని ఒక వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం రేపుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే మ‌రోసారి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాడుకోవాలని భావించిన చంద్ర‌బాబుకు ఇది ఊహించ‌ని షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి అక్క సుహాసిని కోసం ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.మీ అభిప్రాయం ప్ర‌కారం జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారానికి వ‌స్తే ఎలా ఉంటుంది.. రాక‌పోతే ప‌రిస్దితి ఎలా ఉంటుంది అనేది కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.