అమర జవాను సతీమణి.. ఏమి చేస్తుందో చూస్తే హ్యాట్స్ ఫ్ అంటారు

240

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓ అమర జవాను కోసం ఆయన సతీమణి తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఎక్కడైతే భర్తను కోల్పోయిందో అక్కడే తన సంతోషాన్ని వెతుక్కునేందుకు సైన్యంలో చేరిందామె. ఏడుస్తూ కూర్చునే కంటే భర్త గర్వించేలా బ్రతకడమే తన జీవిత లక్ష్యమంటున్న ఆమె సాహసగాథ తెలియాలంటే రెండేళ్లు వెనక్కి వెళ్లాలి. ముంబైలోని విహార్ ప్రాంతానికి చెందిన గౌరీ ప్రసాద్ మహదిక్ భర్త ప్రసాద్ గణేశ్ ఆర్మీ మేజర్‌గా సేవలు అందించారు. భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ 2017లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండేళ్లకే భర్తను కోల్పోవడంతో గౌరీ కలల ప్రపంచం తల్లకిందులైంది.

అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు. అప్పటి వరకు తాను పనిచేస్తున్న ఓ కంపెనీకి రాజీనామా చేసి సైన్యంలో చేరాలని నిర్ణయించకున్నారు.అనుకున్నట్టుగానే సంవత్సరం పూర్తయ్యేలోపు ఆర్మీ ఉద్యోగం సంపాదించి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను న్యాయవాదిగా, ఓ కంపెనీ సెక్రటరీగా, ఎలాంటి లోటు లేకుండా ఉద్యోగం చేశాను. కానీ భర్త చనిపోయిన తర్వాత ఉద్యోగం వదిలేసి ఆర్మీ ఉద్యోగం కోసం సిద్ధపడ్డాను. నా భర్తకు నిజమైన నివాళి అర్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సైన్యంలో ట్రైనింగ్ పూర్తయ్యాక నేను ధరించబోయే యూనిఫామ్‌లో నా భర్తను చూసుకుంటా.. ఆ యూనిఫామ్ మా ఇద్దరిదీ..’’ అని పేర్కొన్నారు. గతేడాది జరిగిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) పరీక్షలో గౌరి మహదిక్ (31) ఎంపికయ్యారు.

ఈ క్రింది వీడియో చూడండి 

విడో కేటగిరీ కింద రెండో ప్రయత్నంలోనే ఆమె టాప్ ర్యాంకర్‌గా నిలిచారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నైలోని భారత ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో గౌరీ చేరనున్నారు. 49 వారాల పాటు శిక్షణ తీసుకోన్నారు. అకాడమీలో ఏడాది పాటు తప్పని సరిగా తీసుకోవాల్సిన ఈ శిక్షణ తర్వాత ఆమె లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలోకి ప్రవేశిస్తారు. ‘‘నేను ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండాలని ఆయన కోరుకునేవారు. అందుకే నేను సైన్యంలో చేరేందుకు నిర్ణయించుకున్నాను. ఆయన యూనిఫామ్ ధరించి, ఆయన స్టార్స్ మా యూనిఫాంపై పెట్టుకుంటాను. అది ‘మా’ యూనిఫాం ఎందుకంటే.. అది నాది, నా భర్తది కూడా..’’ అని గౌరీ పేర్కొన్నారు.