ప్రదీప్ పెళ్లి చుప్పుల్లో ఊహించని ఘటన ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్

371

రోటీన్ సీరియల్స్, రోటీన్ షోలకు కాలం చెల్లింది. అందుకే తెలుగు బుల్లితెరపై కూడా విభిన్నమైన కాన్సెప్టులతో టీవీ షోలు ప్లాన్ వస్తున్నాయి. అలా ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక సరికొత్త షో ‘పెళ్లి చూపులు’. తెలుగు టెలివిజన్ రంగంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ ‘పెళ్లి చూపులు’ రియాల్టీ షోద్వారా తనకు పర్ఫెక్ట్ జోడినీ, జీవిత భాగస్వామిని ఎంచుకోబోతున్నారు. ఆదివారం బిగ్ బాస్ 2 ముగియడంతో ఆ స్థానంలో ఈ సరికొత్త షో ప్రారంభం అయింది. దేశ విదేశాల నుండి ఎందరో తెలుగు అమ్మాయిలు రిజిస్టర్ చేసుకోగా 14 మందిని ఫైనల్ చేశారు. ఈ షోను యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్నారు.‘పెళ్లి చూపులు’ కోసం ఎంపికైన 14 మంది అమ్మాయిలతో ప్రదీప్ డేటింగ్ చేయడం, వారిని వివిధ దశల్లో పరీక్షించడం ద్వారా తనకు పర్ఫెక్టుగా సూటయ్యే అమ్మాయిని ఎంచుకుంటాడు ప్రదీప్. ఒక్కో వారం ఒక్కొక్కరు ఈ షో నుండి ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. అన్ని దశలను దాటి ఫైనల్‌కు చేరుకునే అమ్మాయిని ప్రదీప్ తన బెస్ట్ పార్ట్‌నర్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ షోకు ఎంపికైన 14 మంది అమ్మాయి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Image result for pradeep pelli choopulu

దివ్య
మచిలీపట్నం అమ్మాయి. ప్రస్తుతం విజయవాడలో జాబ్ చేస్తోంది. ప్రదీప్ ను కలిసిన సందర్భంగా అతడి గురించి దివ్య మాట్లాడుతూ… నీది యూనిక్ స్టైల్. మీరు మాట్లాడే విధానం, ఇతరులను ఇంప్రెస్ చేసే విధానం బావుంటుంది. నేను ఈ షోకు సెలక్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే మీపై ప్రేమ ఇంకా పెరిగిపోయింది.’ అని వ్యాఖ్యానించారు.
నేహా అజ్మల్
మలేషియా నుండి వచ్చారు. ప్రదీప్‌ను కలిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘నేను మలేషియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మిమ్మల్ని చూస్తుంటే నా గుండె జారి పోతోంది. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు.’ అంటూ పొగిడేసింది. ఈ సందర్భంగా ప్రదీప్ కోసం మలేషియా నుండి తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ బహూకరించారు.
రమ్య కృష్ణ
విజయవాడకు చెందిన అమ్మాయి. ‘నా పేరు కోనేరు రమ్య కృష్ణ. కేవలం మీ కోసం విజయవాడ నుండి వచ్చాను. మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తాను’ అని తనను తాను ప్రదీప్‌కు పరిచయం చేసుకున్నారు.

Image result for pradeep pelli choopulu
శ్రేయ
హైదరాబాద్ అమ్మాయి. ‘నేను శ్రేయ… నేను మీ కోసం హైదరాబాద్ నుండి వచ్చాను. మిమ్మల్ని చూడగానే నన్ను నేను మరిచిపోయాను. నిన్ను చూడగానే బూస్ట్ అప్ అపోయాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను’ అంటూ ప్రదీప్ కు పరిచయం చేసుకున్నారు.
దాసరి సాహితి
విజయవాడ అమ్మాయి. ‘ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు. ప్రదీప్ తో పెళ్లి చూపులు అవుతుందని నేను అస్సలు ఊహించలేదు.’ అన్నారు. ఈ సందర్భంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు. నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నానో 101 కారణాలు వెల్లడించే కార్డులు ఈ గిఫ్ట్‌లో ఉన్నాయి.
కనకాల నవ్య సౌజన్య (యస్వి)
యస్వి కనకాల మాట్లాడుతూ…‘ నా పేరు యస్వి మాచిరాజు… సారీ యస్వి కనకాల. నేను ఈ షోకు వచ్చే ముందు మా స్నేహితులతో యస్వి మాచిరాజుగా తిరిగి వస్తానని మాట ఇచ్చాను. మిమ్మల్ని చూడగానే పరుగెత్తుకొచ్చి హగ్ చేసుకోవాలనిపించింది. కానీ ఈ జర్నీలో మీరే నన్ను హగ్ చేసుకునేలా చేస్తాననే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

Image result for pradeep pelli choopulu
రీతూ శేఖర్
రీతూ శేఖర్ రావడంతోనే ప్రదీప్‌కు తనను తాను పరిచయం చేసుకుని, తాను జర్నలిజం చేస్తుంటానని, మీరు చాలా ఇంప్రెసివ్ మ్యాన్ అని అంటూ ప్రదీప్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ బహూకరించింది.
మౌనిక
మౌనిక, కడప అమ్మాయి. రావడంతోనే ఎగ్జైట్ అయిపోయిన మౌనిక… ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. అనంతరం ప్రదీప్‌తో కొన్ని స్టెప్స్ కూడా వేయించారు.
డయానా
డయానా, అనంతపూర్ అమ్మాయి. డయానా రావడానికి ముందు వాళ్ల అమ్మ రావడంతో ప్రదీప్ షాకయ్యాడు. అనంతరం డయానా ఎంట్రీ ఇచ్చారు. మీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ డయానా చెప్పడం గమనార్హం.
చంద్రకళ
చంద్రకళ, బెంగుళూరు అమ్మాయి. నిన్ను చూసిన తర్వాత మాటలు రావడం లేదంటూ సిగ్గు పడిపోయింది. మిమ్మల్ని కలుస్తానని అస్సలు ఊహించలేదని, తాను బెంగుళూరులో అకడమిక్ కౌన్సిలర్ గా పని చేస్తున్నట్లు వెల్లడించారు.

Image result for pradeep pelli choopulu
దివ్య అశోక్ దెకాటే
దివ్య అశోక్ దెకాటే, నాగ్ పూర్ అమ్మాయి. తనకు తెలుగు రాక పోయినా మీకోసం తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నాను అంటూ ప్రదీప్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసింది.
షేక్ సబీనా
పెద్ద చాక్లేట్ సూపర్ గుంటుంది. రెండు రూపాయలకే మూడు చాక్లెట్లు. మీకో సగం… నాకో సగం ఏమిటి? అని అడగ్గానే…. ప్రదీప్ లవ్ యూ అని సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె ప్రదీప్ కోసం ఓ పాట కూడా పాడారు.
జ్ఞానేశ్వరి కందిరేగుల
జ్ఞానేశ్వరి రావడంతోనే ప్రదీప్‌ను ఇంప్రెస్ చేసింది. ఈ సందర్భంగా కళ్ల జోడును గిఫ్టుగా ఇచ్చింది.
దీనా
దీనా, మలయాళీ గర్ల్… దుబాయ్ నుండి వచ్చింది. ‘నేను దుబాయ్ నుండి జాబ్ అన్నీ వదులుకుని పేరెంట్స్‌ను ఒప్పించి నీ కోసం వచ్చాను. నేను అక్కడ లాజిస్టిక్స్ కంపెనీలో పని చేస్తుంటాను.’ అని వెల్లడించారు.ఇది విన్న ప్రదీప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.నాకోసం దుబాయ్ నుంచి జాబ్ మానేసి వచ్చావంటేనే నాకు అర్థం అవుతుంది నేనంటే నీకు ఎంత ఇష్టమో.ఈ ప్రేమ ఎప్పటికి అలాగే ఉండాలని అన్ని కలిసుంటే పెళ్లి జరగాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వీళ్ళేనండీ ప్రదీప్ పెళ్లి చూపులకు వచ్చిన 14 మంది అమ్మాయిలు.మరి వీరిలో ఎవరు ప్రదీప్ జీవిత భాగస్వామి అవుతారో చూడాలి.ఎవరు వచ్చిన వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ పెళ్లిచూపులు కాన్సెప్ట్ గురించి అలాగే ఈ 14 మంది అమ్మాయిల గురించి అలాగే వీరిలో ఎవరు ప్రదీప్ కు సరైన జోడి అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.