రేవంత్ రెడ్డి ఇంట్లో ఎంత బంగారం, నగదు దొరికిందో చూస్తే మతిపోవడం ఖాయం

406

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల హీటు నోటిఫికేష‌న్ రాకుండానే పెరిగిపోయింది, తాజాగా రేవంత్ రెడ్డి పై ఇప్పుడు ఐటీ ఈడీ దాడులు యావ‌త్ తెలంగాణ‌లో స‌రికొత్త‌ చ‌ర్చకు దారి తీస్తున్నాయి..కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఫెమా, మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. మొత్తం 19 షెల్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు ఉన్నాయి. నెక్సెస్ ఫీడ్స్ లిమిటెడ్ పేరుతో షెల్ కంపెనీలు నిర్వహించినట్లు ఫిర్యాదుదారుడి వాదన అని తెలుస్తోంది. 2014, ఫిబ్రవరి 25న సింగపూర్‌లోని ఒక స్థిరాస్థిని 20 లక్షల సింగపూర్ డాలర్లకు రేవంత్‌రెడ్డి విక్రయించినట్లు ఫిర్యాదులో రామారావు పేర్కొన్నారు. అదే రోజున రేవంత్‌రెడ్డి అకౌంట్లోకి 9 కోట్ల రూపాయలను రఘువరన్ మురళి బదిలి చేసినట్లు ఫిర్యాదులో ఉంది. రేవంత్ రెడ్డి వియ్యంకుడు వెంకట్‌రెడ్డి ఖాతాకి 60 లక్షల మలేషియన్ రింగేట్స్ బదిలీ అయినట్లు ఆరోపించారు.

దుబాయ్‌లో హవాలా ద్వారా సింగపూర్, మలేషియాలో వందల కోట్లు కూడబెట్టినట్లు ఆరోపించిన ఫిర్యాదుదారుడు.. రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఎన్నో అక్రమ వ్యాపార కార్యకలాపాలకు పాల్పడ్డారని అంటున్నారు. నెక్సెస్ ఫీడ్స్ లిమిటెడ్ పేరుతో షెల్ కంపెనీ నిర్వహిస్తూ 65 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రేవంత్‌రెడ్డి కొల్లగొట్టాడని అభియోగం మోపారు. 14 కోట్లతో చైనా తైవాన్ నుంచి గోల్డెన్ ఫీడ్స్ పేరుతో మిషనరీని కొనుగోలు చేసిన రేవంత్ బినామీ వెంకట్‌రెడ్డి.. దాన్ని మరో కంపెనీకి 25 కోట్లకు అమ్మాడు. మళ్లీ అదే మిషనరీని 80 కోట్లకు తిరిగి నెక్సస్ ఫీడ్ కొనుగోలు చేసింది. ఈ మొత్తంలో 75 కోట్లు బ్యాంక్ లోన్. ఇలా ఒకే మిషనరీని షెల్ కంపెనీల ద్వారా చేతులు మార్చి ధరను 25 కోట్ల నుంచి 80 కోట్లకు పెంచారని రామారావు ఆరోపించారు.

శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసంస్థలు ఓ సంస్థను నెలకొల్పారని, దీని ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని అందులో తెలిపారు. 300 కోట్ల రూపాయల మేర చట్ట విరుద్దంగా డబ్బు చేతులు మారినట్టు అందులో వివరించారు. శ్రీ సాయి మౌర్య ఒకటే కాకుండా మరో 10, 15 సంస్థలు కూడా ఉన్నాయని అడ్వకేట్‌ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు ఆయన మామ పద్మారెడ్డి, బావమరిది జయప్రకాష్‌ రెడ్డి పేర్లను రాశారు. అన్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులే ఉన్నారని వివరించారు. రిజిస్టర్డ్ ఆఫీస్‌గా 346, జూబ్లిహిల్స్-హైదరాబాద్‌ అనే అడ్రస్‌ ఉందని.. అక్కడ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నివాసం ఉంటున్నారని కూడా అడ్వకేట్‌ సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభియోగాలతో జరిగిన సోదాల తర్వాత రేవంత్‌పై అవినీతి నిరోధక చట్టం, బ్లాక్ మనీ ఇన్ కం ట్యాక్స్ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కింద అభియోగాలు మోపారు. రేవంత్ రెడ్డికి నోటీసులతో పాటు అభియోగాల పత్రాలను ఇచ్చారు. మొత్తానికి వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంది అని ఓ అంచ‌నా వేస్తున్నార‌ట అధికారులు..