డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న‌వారు ఇలా చేయాలి లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు కేంద్రం కొత్త నిర్ణ‌యం

910

ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ప్రభుత్వ ఉద్యోగాలకైన, పథకాలకైనా, వివిధ రకాల గుర్తింపు కార్డుల కోసం, బ్యాంకు అకౌంట్స్, లోన్ కావాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఆధార్ కార్డు వల్ల ఒకరికి ఒకటే పర్మినెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అన్ని అవసరాలకి ఆధార్ కార్డు ఉపయోగ పడుతుంది కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏదైనా పొరపాటు వల్ల ఆధార్ కార్డు పోగుట్టుకున్నట్లు అయితే దానిని తిరిగి పొందడం కూడా ఇప్పుడు సులువు అనే చెప్పాలి.

Image result for driving license

ఇక ఆధార్ కార్డు లింకింగ్‌లోకి మరో కార్డు వచ్చి చేరింది. గతంలో బ్యాంకు అకౌంట్, సింకార్డు, వంట గ్యాస్, ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుని లింక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లకు చెక్ పెట్టడానికి అలాగే యాక్సిడెంట్ కేసులను త్వరితగతిన విచారణ జరపడానికి సులువుగా మోటారు వాహనాల లైసెన్స్‌కు ఆధార్ కార్డుని అనుసంధానం చేసే ప్రయత్నంలో ఉంది కేంద్ర ప్రభుత్వం. మోటారు వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సును ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

Image result for driving license

దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నకిలీ పాన్ కార్డుల ఏరివేతకు ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అలాగే, నకిలీ డ్రైవింగ్ లైసెన్సులను ఏరివేసేందుకు వీలుగా ఆధార్ నంబరుతో లింకు పెట్టనుంది.ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. నకిలీ లైసెన్సులను, అలాగే ఒకే పేరుపై వివిధ ఆర్టీఏ ఆఫీసుల్లో లైసెన్సులు పొందడాన్ని అరికట్టవచ్చని, ట్రాఫిక్ ఉల్లంఘనలపై సత్వర చర్యలు తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలా చేస్తే దేశవ్యాప్తంగా మోటారు వాహనాలకు సంబంధించిన పలు కేసుల దర్యాప్తు ఈజీ అవుతుందని తెలిపారు. దేశంలో ఒకచోట రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి, మరోచోట కొత్త డ్రైవింగ్‌ లైసెన్సు పొందుతున్నాడని, ఫలితంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడని మంత్రి చెప్పారు. అదే ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. తప్పుడు చిరునామా, ధ్రువీకరణపత్రాలతో కొత్త లైసెన్సు పొందలేరన్నారు. మ‌రి కేంద్రం తీసుకుంటున్న ఈనిర్ణ‌యం మంచిదే అని ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.