ఎలక్ట్రిషియన్ కొడుకు ఇన్నోవేషన్కు అమెరికా కంపెనీ ఫిదా రూ 70 లక్షల జీతం

496

కష్టే ఫలి అని మన పెద్దలు అంటారు.కష్ట పడితే చాలు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.ఇప్పటివరకు సమాజంలో ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళందరు కష్టపడి సాధించిన వాళ్ళే.మనం ఇప్పటివరకు చాలా మందిని చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళను చూసే ఉంటాం.వాళ్ళు మనకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు.ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్.ఎందుకంటే ఆయన జీవితం అలాంటిది.తండ్రి సామాన్య ఎలక్ట్రిషియన్.ఐతేనేమి ఇప్పుడు తండ్రి తల ఎత్తుకునేలా చేశాడు.70 లక్షల ఉద్యోగం సంపాదించాడు.మరి ఆ స్థాయికి చేరుకోడానికి అతను పడిన కష్టం ఎలాంటిదో తెలుసుకుందామా.

బీటెక్ మధ్యలో ఆపేసి

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ ఎలక్ట్రిషియన్ కొడుకు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో దాదాపు రూ.70 లక్షల ఉద్యోగం సంపాదించాడు. అతని పేరు మహమ్మద్ అమీర్ అలీ. అతని తండ్రి సాధారణ ఎలక్ట్రిషియన్.అలీ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాడు. డిప్లొమాతో అత్యధిక ప్యాకేజీ పొందిన విద్యార్థి అలీయే కావడం గమనార్హం. 2015లో అతను డిప్లొమా పూర్తి చేశాడు.చదువుకోవడానికి సరైన స్థోమత లేని అలీ ఇప్పుడు అమెరికాలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం పట్ల అతని కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. అతను ఆర్థిక పరిస్థితుల కారణంగా జార్ఖండ్‌లో బీటెక్ ఆర్కిటెక్చర్ కోర్సును పూర్తి చేయలేకపోయాడు. కొన్నాళ్ల తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.తండ్రి ఎలక్ట్రిషియన్ కావడంతో అలీ చిన్నప్పటి నుంచి ఎలక్టిరిక్ పరికరాలకు సంబంధించిన పరిశోధన చేయడం అలవాటుగా మారింది.

ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ సిద్ధాంతం

డిప్లొమా చేస్తూ కూడా తన పరిశోధనలను కొనసాగించాడు. అలా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు సంబంధించి ఒక సిద్ధాంతాన్ని పరిశోధించడం ప్రారంభించాడు.మన దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రానిక్ వాహనాల హవా ప్రారంభమవుతోంది. తాను పరిశోధించిన సిద్ధాంతం విజయవంతం అయితే కనుక ఖర్చు లేకుండానే ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేయవచ్చునని అలీ చెబుతున్నాడు. తన ప్రతిభను ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుర్తించి, సహాయం చేశాడని చెప్పారు.తన పరిశోధనకు సంబంధించిన ప్రోటోటైప్‌ను తాను చదివిన, తండ్రి ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న స్కూల్లో ప్రదర్శించాడు. అందరూ అభినందించారు. దీనిని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌ (సీఐఈ)కి పంపించాడు. దీనిని సీఐఈ డైరెక్టర్ తమ వెబ్‌సైట్లో పెట్టాడు.అమెరికాకు చెందిన ఫ్రిస్సన్ మోటార్ వర్క్స్ అనే ఆటో మొబైల్ సంస్థ ఆ ప్రొటోటైప్‌ను చూసింది. దాని పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వెంటనే సీఐఈ ద్వారా అతని గురించి తెలుసుకొని, తమ కంపెనీలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఎంతో ఆనందించాడు. తన కొడుకు చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఎంతగానో కష్టపడ్డాడని, ఇప్పుడు ఆ కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందన్నాడు.కాబట్టి మీరు కూడా ఇతని లాగానే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడండి.ఎప్పుడో ఒకసారి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.మరి ఎలక్ట్రిషియన్ కొడుకు స్థాయి నుంచి 70 లక్షల జీతం అందుకునే స్థాయికి ఎదిగిన ఈ అమీర్ గురించి అలాగే ఇతని లాగే కష్టపడి ఉన్నతస్థితికి వెళ్ళిన వారి మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.