వైరల్ న్యూస్: విజయ్ దేవరకొండకి అల్లు అర్జున్ హీరోయిన్ తో ఉన్న సంబంధం? బయటపడ్డ సంచలన నిజాలు

288

విజయ్ దేవరకొండ…టాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న హీరో.అర్జున్ రెడ్డి చిత్రంతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ మధ్యనే విడుదల అయినా టాక్సీవాలా కూడా హిట్ అవ్వడంతో మనోడికి అదృష్టం గమ్ పట్టినట్టు పట్టింది అని అనుకుంటున్నారు.. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఇలా ఉండగానే మరొక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన బ్యూటిఫుల్ హీరోయిన్ క్యాథరిన్ నటిస్తుంది.

Image result for కేథరిన్ త్రెసా

సుమారు ఆరేళ్ల క్రితం ‘చమ్మక్ చల్లో’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కేథరిన్ త్రెసా.. ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత తెలుగు, తమిళంలో వరసపెట్టి సినిమాలు చేసినా మెయిన్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. కానీ, అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ముఖ్య పాత్రలో కేథరిన్ నటించింది. ఆ తరవాత ‘జయ జానకి నాయక’లో ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. ఏడాదిన్నరకు పైగా విరామం తరవాత ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాను కేథరిన్ అంగీకరించింది.

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా.. కిందటేడాది దసరా సందర్భంగా ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో రాశీఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జేకే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కేఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కేథరిన్ త్రెసా ఎంపికైంది. వాస్తవానికి విజయ్, కేథరిన్‌ మధ్య మైత్రి ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి కూకట్‌పల్లిలో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ అందరినీ ఆకర్షించారు. ఇప్పుడు తెరపై రొమాన్స్ చేయబోతున్నారు.చూడాలి మరి వీరి పెయిర్ ఎలా ఉంటుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. విజయ్ దేవరకొండ క్యాథరిన్ పెయిర్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.