Breaking News : #RRR షూటింగ్ లో భారీ ప్రమాదం… ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలు

433

దర్శకదీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా #RRR. బాహుబలి లాంటి ఇంటర్నేషన్ సినిమా తీసిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆయన ప్రెస్టీజ్ ఎక్కడ పోకూడదనే ఉద్దేశంతో చాల జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హీరోలుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను dvv దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే సెకండ్ షెడ్యూలు స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా గురించి ఇతర విషయాలు ఒకటి కూడా బయటపడలేదు. ఇటీవల తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని స్పష్టమైంది. ఈ నటుడి పేరు మినహా మిగిలిన పేర్లేమీ బయటకు రాలేదు ఎన్టీఆర్, రాంచరణ్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. మొదట ఈ చిత్రం కోసం కీర్తి సురేష్, సమంత లాంటి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ రాజమౌళి ఖరారు చేయలేదు. ప్రస్తుతం రాజమౌళి చూపు బాలీవుడ్ హీరోయిన్లపై పడ్డట్లు తెలుస్తోంది.

Image result for rrr ntr new look

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరోయిన్లతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పరిణితి చోప్రా, సోనాక్షి సిన్హా, అలియా భట్ లతో కూడా రాజమౌళి సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఈ ముగ్గురిలో ఇద్దరినీ ఒకే చేసే అవకాశం ఉంది.ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఒక ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంట. షూటింగ్ ను రెండు టీమ్స్ గా చేశాడంట రాజమౌళి. ఒక మెయిన్ టీమ్ తో కలిసి కొన్ని ముఖ్య సీన్స్ తీస్తుంటే మరొక టీమ్ ఇతర తారాగణం మీద సీన్స్ తీస్తుందట. ఈ విధంగా చేస్తేనే త్వరగా సినిమాను కంప్లీట్ చేస్తామని రాజమౌళి అనుకుని ఇలా చేస్తున్నాడంట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే నిన్న రాత్రి ఎన్టీఆర్ మీద ఒక సీన్ షూట్ చెయ్యాల్సి ఉందంట. నైట్ ఎఫెక్ట్ రావడం కోసం రాత్రి పెట్టుకున్నాడంట. చుట్టూ మొత్తం లైట్స్ పెట్టి షూటింగ్ చేస్తున్నాడంట రాజమౌళి. అలా ఏర్పాటుచేసిన లైట్స్ లలో కొన్ని విరిగి ఎన్టీఆర్ పక్కన పడ్డాయంట. అయితే కింద పడటం గమనించిన ఎన్టీఆర్ వెంటనే పక్కకు తప్పుకున్నాడంట. ఆ ఘటనను చుసిన టీమ్ మొత్తం ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయిందంట. చివరికి ఎన్టీఆర్ కు ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఈ విషయం తెలిసిన ఆయన భార్య ప్రణతి తల్లి షాలిని కొంత ఆందోళన చెందారని సమాచారం. అయితే ఇంటికెళ్లి ఏమి కాలేదని చెప్పడంతో వారు కొంత రిలాక్స్ అయ్యారంట. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. #RRR చిత్రం గురించి ఆలాగే ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి