వివేకా హ‌త్య కేసులో మ‌రో ట్విస్ట్ లొంగిపోయిన కీల‌క వ్య‌క్తి

355

మాజీ మంత్రి వై ఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పెద్దసోమప్పగారి చంద్రశేఖర్‌రెడ్డి (దిద్దెకుంట శేఖర్‌)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్దరాత్రి పులివెందుల పట్టణంలో లక్ష్మి థియేటర్‌ వెనుక వీధిలో అతను ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఆ వ్యక్తిని కడపకు తరలించారు. అతనితో పాటు మంగళవారం మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నలుగురు కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి అనుచరులుగా తెలిసింది. శుక్రవారం మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు.

Image result for ys vivekananda reddy daughter

అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు సవాల్‌గా నిలిచింది. ఈ కేసును చేదించేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. సిట్‌లో ఐదు బృందాలు, మరో ఏడు పోలీసు బృందాలను ఏర్పాటుచేసి విచారణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న పీఏ ద గ్గరి నుంచి డ్రైవర్‌ వరకు అందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వైఎస్‌ కుటుంబ సభ్యులను కూడా పోలీ్‌సస్టేషన్‌కు పిలిచి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. సోమవారం కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ని తిరుపతి ఆసుపత్రిలో పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. అతన్ని కూడా కడపలో విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రో జు నుంచి పరమేశ్వర్‌రెడ్డి మాయమయ్యారు.

Image result for ys vivekananda reddy daughter

ఉన్నట్లుండి తిరుపతి ఆసుపత్రిలో ప్రత్యక్షం కా వడం, మీడియాతో మాట్లాడడం, పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నారు. అతనితో పాటు సోమవారం అర్దరాత్రి దిద్దెకుంట శేఖర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి అనుచరులను మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. వీరిని కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఈ కేసుపై సిట్‌ దర్యాప్తుపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు సరికాదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తెలియ‌చేశారు. జగన్‌ సీఎం కావాలని తన తండ్రి కోరుకున్నారని, ఆయన కల అదేనని సునీత చెప్పారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, 700 మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబం తమదని ఆమె తెలిపారు. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు సహజమని, దర్యాప్తు సాగుతుండగా తమ అభిప్రాయాలు ఎలా చెబుతామని సునీత ప్రశ్నించారు.హంతకులను గుర్తించడం ముఖ్యమని ఆమె చెప్పారు. తన తండ్రి చనిపోయారని తామంతా బాధపడుతుంటే నెగిటివ్ వార్తలు ప్రచారం చేయడం తగదని వివేకా కుమార్తె హితవు పలికారు. అలా అవాస్తవాలు ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు, మీడియాకు తనది ఒకటే విన్నపమని, తన తండ్రి ఇప్పటికీ బ్రతికి ఉంటే ఎలాంటి గౌరవం చూపుతారో… ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని ఆమె అభ్యర్థించారు