కేరళ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించిన అల్లు అర్జున్..

385

భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ ప్రజల కోసం పలువురు సినీ స్టార్లు తమ వంతు సహాయం అందించారు. కమల్ హాసన్, సూర్య, విజయ్ దేవరకొండ, కార్తి తదితరులు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. హీరో విశాల్‌ ‘కేరళ రెస్క్యూ’ పేరుతో అత్యవసర వస్తువులను సేకరించి బాధితులకు అందించే ప్రయత్నంలో ఉన్నారు.

 

Related image

దీనిపై స్పందించిన కమల్ హాసన్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తమిళ స్టార్లు సూర్య, కార్తి కలిసి రూ. 25 లక్షలు ప్రకటించారు. తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు.తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేరళ వరద బాధితులకు తన వంతు సాయాన్ని ప్రకటించారు. రూ.25 లక్షలు దానం చేశారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.కేరళ ప్రజలు ఎప్పుడూ తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తారని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాళ్లు తనపై అపారమైన ప్రేమానురాగాలను కురిపిస్తారన్నారు. కేరళ ప్రజలకు తనవంతు సాయంగా రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.