Breaking News : మురళీమోహన్‌ తల్లి మృతి.. కుప్పకూలిపోయిన మురళీమోహన్

221

సినీ ప్రముఖుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.చాలా మంది సినీ ప్రముఖులు లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోయారు.రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు చనిపోతుంటే ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు.ఆ మధ్య కన్నడ హీరో దేవ్ రాజ్ కు కూడా యాక్సిడెంట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మరొక రోడ్డు ప్రమాదంలో నటులు రచన జీవన్ చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. నిన్నటికి నిన్న ఇద్దరు టాలీవుడ్ నటులు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ విషాదం నుంచి బయటపడకముందే మరొక సినీ లెజెండ్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Actor Murali Mohan bereaved

సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మాగంటి వసుమతిదేవి (100) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. వసుమతీదేవి మృతదేహాన్ని రాజమహేంద్రవారంలోని జేఎన్ రోడ్‌లో ఉన్న మురళీమోహన్ నివాసానికి తీసుకురానున్నారు. శుక్రవారం ఉదయం వసుమతీదేవి అంత్యక్రియలు రాజమండ్రిలో నిర్వహించనున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

కాగా.. ఇటీవల మురళీమోహన్ తన తల్లి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వసుమతీదేవి కుటుంబానికి చెందిన సుమారు 100 మందికి పైగా హాజరయ్యారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీసంకరపురం గ్రామంలో వేడుకలు నిర్వహించగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఇటీవల మాతృ దినోత్సవ సందర్భంగా.. ‘తన శరీరం నుంచి ఇంకొకశరీరం పుట్టు కొస్తుందనే ఆలోచన అద్భుతంతంగా ఉంటుంది, ఆ అనుభవం ఒకతల్లికీ తప్పవేరెవరికి ఉండదు. అందుకే తల్లికి తన సంతానంపై అంత మమకారం’ అంటూ తన తల్లికి శుభాకాంక్షల్ని తెలియజేశారు మురళీమోహన్. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్‌ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.