మ‌హిళ పై 19 ఏళ్ల అమ్మాయి రేప్ అది చూసి అవాక్క‌యిన పోలీసులు

415

ఈ క‌లికాలంలో ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో కూడా అర్ధం కాని ప‌రిస్దితి అయితే ఉంది అని చెప్పాలి.ఇద్దరు పురుషులు, ఓ 19 ఏళ్ల అమ్మాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని 25 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కలిసి వ్యాపారం చేద్దామని నమ్మించిన ఆ అమ్మాయి.. తనపై లైంగిక దాడి చేసిందని, మరో ఇద్దరు పురుషులు తనను రేప్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. నిందితుల్లో ఒక పురుషుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీమపురి పోలీసులకు బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Image result for girls depression

బాధితురాలు గుర్గావ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేది. కొన్ని నెలల క్రితం ఆ ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓ అమ్మాయి ఆమెకు పరిచయమైంది. తాను ఐటీ కంపెనీలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నానని నమ్మించింది. ఆమె మరో ఇద్దరు పురుషులను పరిచయం చేసింది. వీరు నలుగురు కలిసి ఆన్‌లైన్‌లో దుస్తులు విక్రయించే వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు.ఆన్‌లైన్ వ్యాపారంలో నైపుణ్యం కోసం బాధితురాలు పంజాబ్ వెళ్లి సంబంధిత కోర్సులో శిక్షణ కూడా పొందింది. ఒక రోజు, నిందితుల్లో ఒకరు ఆమెకు ఫోన్ చేసి వ్యాపారం కోసం రూ.1.5 లక్షలు కావాలని అడిగారు. బాధితురాలు తన తండ్రికి చెప్పి ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసింది. ఆ తరవాత బాధితురాలిని నిందితులు దిల్షద్ కాలనీలోని తమ అపార్ట్‌మెంట్‌కు రావాలని కోరారు. బాధితురాలు అక్కడికి వెళ్లిన తరవాత ఆమెను ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారు. దాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో కూడా తీశారు.

తాము చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. ఒక గదిలో బంధించి వ్యభిచారం చేయడానికి సిద్ధం చేయడానికి సెక్స్ టాయ్స్‌తో ఆమెకు నరకం చూపించారు. నిందితుల్లో ఒకరైన 19 ఏళ్ల అమ్మాయి సెక్స్ టాయ్స్‌తో బాధితురాలిపై లైంగిక దాడికి దిగింది. కొన్ని రోజులు ఆ గదిలోనే నరక యాతన అనుభవించిన బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీలోని షాదర డీసీపీ మేఘనా యాదవ్ వెల్లడించారు. మొత్తానికి తెలియ‌ని వారిని న‌మ్మి డ‌బ్బులు ఇచ్చి, బిజినెస్ చేస్తే ఇలానే ఉంటుంది అని ఇలాంటి కిలాడీల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని చెబుతున్నారు పోలీసులు, దీనిపై ఆయువ‌తికి న్యాయం చేస్తామ‌ని చెబుతున్నారు పోలీసులు. మరి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.