పెద్దల సభకు కొత్తగా నలుగురు ప్రముఖులు

432

కేంద్రప్రభుత్వం రాజ్యసభకు పెద్దలను పంపించే ఆనవాయితీ తెలిసిందే.. ఈ ప్రాసెస్ లో నేడు నలుగురు ప్రముఖులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఇవాళ రాజ్యసభకు నామినేట్ చేశారు.. తాజాగా రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో యూపీ మాజీ బీజేపీ ఎంపీ, దళిత నాయకుడు రామ్ షకల్, ఆరెస్సెస్ ప్రముఖుడు రాకేశ్ సిన్హా, శాస్త్రీయ నృత్యకారుడు సోనాల్ మాన్సింగ్, కళాకారుడు రఘునాథ్ మహాపాత్ర తదితరులు ఉన్నారు… సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాల్లో ఉద్దండ పండితులైన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.

Image result for ram shakal

ఈ విభాగంలో ఇప్పటికే రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయి ఉన్నారు.. ఇక మిగిలిన నాలుగు స్ధానాలకు కూడా కేంద్రం సిఫారసు చేయడంతో రాష్ట్రపతి వారి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. తాజాగా రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో రామ్ షకల్.. ఉత్తరప్రదేశ్లోని రాబర్ట్స్గంజ్ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రాకేశ్ సిన్హా ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇండియా పాలసీ ఫౌండేషన్ను స్థాపించారు. ప్రస్తుతం సదరు సంస్థకు గౌరవ డైరెక్టర్గా కొనసాగుతున్నారు… రఘునాథ్ మహాపాత్ర గత ఆరు దశాబ్దాలుగా భరత నాట్యం, ఒడిస్సి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.

Related image

ఇక రాజ్యసభలో వీరి ఎంపికతో వారు రాష్ట్రపతికి ఇటు కేంద్రానికి కృతజ్ఙతలు తెలియచేశారు.. ఇలా కళాకారులను కూడా పెద్దల సభకు పంపండం.. క్రీడాకారులు, నటీమణులను కూడా పెద్దల సభకు పంపడం ఆనవాయితీగా వస్తుందే.