వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే క్లారిటీ

163

గత కొద్దిరోజులుగా మంగళగిరి సెగ్మెంట్లో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే ఆర్కేకు సీటు ఇస్తారా లేదా, జగన్ ఇక్కడ వేరేవారికి సీటు ఇస్తారా అనే ఆలోచన వస్తోంది.. ఈ టికెట్ రేసులో ఇప్పటికే ఇద్దరు బీసీ నేతలు కూడా ఉండటంతో, అసలు ఎవరు ఇక్కడ పోటికి అనే సస్పెన్స్ ఉండేది …తాజాగా అనేక రూమర్లు కూడా స్ప్రెడ్ అయ్యాయి, ఇక ఆర్కే పార్టీ నుంచి దూరంగా ఉన్నారు అనేలా వార్తలు వినిపించాయి… కాని ఇప్పుడు ఆయనే నేరుగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Image result for ycp mla rk
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా..ఇవ్వకపోయినా.. తాను మాత్రం జగన్ సైనికుడినేనని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సీటు విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఒక కేసు విషయంలో సాక్ష్యాలు సేకరించడానికి నాలుగు రోజులు అజ్ఞాతంలో ఉన్నానని, ఈ లోగా తన అనుచరులు లోటస్ పాండ్కు వచ్చి గొడవ చేశారన్న విషయం తనకు తెలియదన్నారు… కౌన్సిలర్ల రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు ఆర్కే పేర్కొన్నారు. మొత్తానికి ఈ సెగ్మెంట్లో జగన్ ఎందుకు ఆర్కేకి కాకుండా వేరేవారికి సీటు ఇవ్వాలి అనుకుంటున్నారు? అనేక కేసులు వేసి వైసీపీ తరపున బలంగా నిలబడిన ఆయనకు, ఎందుకు సీటు విషయంలో ఆలోచనలు అంటే ? సమాధానం మాత్రం లేదు వైసీపీ నుంచి.