వైసీపీలో చేరిన చిన్ని కృష్ణ

173

పాలకొల్లులో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైయస్ జగన్ సమక్షంలో ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణతోపాటు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు, అడబాల వెంకట రమణ, బీసీ ఉద్యమ నాయకుడు చింతపల్లి గురు ప్రసాద్లకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితం రజినీకాంత్తో ప్రారంభమైందని.. రాజకీయ జీవితం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆరంభం అయిందని తెలిపారు.

వైఎస్ జగన్ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు..జగన్ తన తండ్రి వైయస్ఆర్ పేరు నిలబెడతారని, రాజన్న రాజ్య స్ధాపన జగన్ తో సాధ్యం అని అన్నారు, నవరత్నాలపై కూడా ఆయన ఇవి పేదలకు ఎంతో మేలు చేకూరుస్తాయని తెలియచేశారు.