విశాఖ తీరంలో మూడు పార్టీల నాయకులు కొత్త వారే

130

విశాఖ పార్లమెంట్ స్ధానం పై ఈసారి రసవత్తర చర్చ అయితే జరుగుతోంది …ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున బాలయ్య చిన్న అల్లుడు
మతుకుమల్లి శ్రీభరత్. మాజీ ఎమ్మల్సీ మూర్తి మనవడు..విద్యావంతుడు. విదేశాల్లో చదువుకున్నారు. గీతం విద్యా సంస్థల బాధ్యతలు ఇటీవలె స్వీకరించారు. తాతల నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు. ఎంవీవీఎస్ మూర్తి గతంలో విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈయన కూడా ఎంపీగా నిలబడి తన తాతలా రాజకీయంగా పేరు తెచ్చుకోవాలి అని చూస్తున్నారు.

Image result for ఎంవీవీ సత్యనారాయణ

వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్. డిగ్రీ చదువుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన చదువు పూర్తయిన తరువాత కొంతకాలం కాంట్రాక్ట్లు చేశారు. ఆ తరువాత విశాఖపట్నం వచ్చి సొంతంగా భవన నిర్మాణ రంగంలో దిగారు. ఎంవీవీ బిల్డర్స్ పేరుతో నగరంలో ఎక్కువ సంఖ్యలో అపార్ట్మెంట్లు నిర్మించారు. అలాగే సినిమా రంగం అంటే ఆసక్తి. సొంతంగా కొన్ని సినిమాలు నిర్మించారు. కొన్నింటిలో గెస్ట్ రోల్, మరికొన్నింటిలో విలన్గా నటించారు. దాదాపు ఏడాది క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరి విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు.సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ జనసేనలో చేరి ఇక్కడ నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు, రాజకీయంగా మార్పు తేవాలి అనే లక్ష్యంతో ఆయన ఓ తొలి అడుగు వేశారు. మొత్తానికీ మూడు పార్టీల మధ్య రసవత్తర పోరు అయితే ఇక్కడ చూడవచ్చు.