బడ్జెట్ పై వైసీపీ ఏమందంటే?

207

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఓ పక్క కాంగ్రెస్ తన విమర్శలు చేస్తుంటే, ఇటు కొన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే బీజేపీ యాంటీపక్షాలు ఈ బడ్జెట్ పై పెదవి విరుస్తున్నాయి.. తాజాగా వైసీపీ కూడా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది…పార్లమెంట్లో శుక్రవారం తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. బడ్జెట్ సమావేశం అనంతర పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు…. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావనే లేదు. పోలవరానికి అదనపు నిధులు ప్రకటించలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే లేకపోవడం బాధకరమని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపించింది అని అంటున్నారు తెలుగుదేశం వైసీపీ నేతలు.