పర్చూరులో జగన్ సంచలన నిర్ణయం

115

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పటికే అభ్యర్దులను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.. ఇక మార్చి 16 ఉదయం 10 గంటలకు తన పార్టీ తరపున పోటీచేసేవారి తొలిజాబితా విడుదల చేయనున్నారు జగన్.. ఇలా అభ్యర్దుల ఎంపికలో బీజీగా ఉంటే, ఇటు మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా అసంతృప్తులను బుజ్జగిస్తూ కొత్తవారికి కొన్ని సెగ్మెంట్లలో అవకాశం ఇవ్వాలి అని చూస్తోంది. ఈ సమయంలో వైసీపీలో పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్ పై మరో వార్త వినిపిస్తోంది.

Image result for parchur mla ycp
             ఇప్పటికే అమెరికా పౌరసత్వం రద్దుకు హితేష్ ప్రక్రియ ప్రారంభించినా, ఇంకా చాలా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తే ముందు ముందు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ భావిస్తోంది. ఆయన అమెరికా పౌరసత్వం క్యాన్సిల్ చేసుకుంటేనే ఆయన ఏపీలో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎన్నికలకు నెలరోజులు మాత్రమే సమయం ఉంది అందుకే ఈసారి 


పర్చూరు నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సూచించారని సమాచారం. జగన్ సూచనకి వెంకటేశ్వరరావు కూడా సానుకూలంగా స్పందిచారని తెలుస్తోంది. మరి జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో పర్చూరులో వైసీపీ జెండా ఎగురుతుందో లేదో చూడాలి.