జగన్ మీడియాపై మంత్రి విమర్శలు

184

ఏపీలో జగన్ కు సపోర్ట్ చేసే మీడియా అన్నీ అసత్యాలు చెబుతుంది అని, వాస్తవాలు వక్రీకరిస్తుంది అని విమర్శిచారు మంత్రి పరిటాల సునీత.ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న పసుపు-కుంకుమ పథకంపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మీడియాలో అసత్య కథనాలు ప్రసారమవుతున్నాయని మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇలాంటి అసత్యాలు చెప్పి ప్రజలకు నిజాలు తెలియకుండా చేస్తున్నారు అని ఆమెవిమర్శలు చేశారు.

Image result for పరిటాల సునీత

పసుపు-కుంకుమ పథకం కింద రూ. 8,604 కోట్లు ఇచ్చామన్నారు. మరో 9,381 కోట్లు ఇస్తామని మంత్రి తెలిపారు. డ్వాక్రాలకు ఇచ్చేది అప్పు కాదని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మహిళల కోసం రూ. 20,518 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి పరిటాల సునీత చెప్పారు.