కొవ్వూరు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఎంట్రీ

119

తెలుగుదేశం పార్టీ తరపున వైసీపీ తరపున జనసేన తరపున నాయకులు టిక్కెట్ల కోసం రెడీ అయ్యారు.. ఇప్పటికే పలువురు నేతలు సీఎం చంద్రబాబుతో జగన్ తో మంతనాలు జరిపి ఆయా పార్టీల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. కొందరికి టికెట్ ఇచ్చే విషయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు పలువురికి… ఫైనల్ గా సీటు మీకే అని తేల్చిచెప్పారు.

Image result for chandrababu

సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీవీ రామారావు కలిశారు. ఈసారి కొవ్వూరు టికెట్ తనకు ఇవ్వాలని ఆయన కోరారు. ఒకవేళ కుదరకపోతే జిల్లాలో ఏదైనా ఎస్సీ నియోజకవర్గం నుంచి తన కుమార్తె దివ్యరాణికి అవకాశం ఇవ్వాలని సీఎంను రామారావు కోరారు.. ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా జవహర్ ఉన్నారు. ఈయన చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ఈ సమయంలో రామారావు కుటుంబం నుంచి సీటు ఆశిస్తుండటంతో చంద్రబాబు టికెట్ ఎవరికి ఇస్తారు అనేది పెద్ద ఆలోచనగా ఇక్కడ టీడీపీ నేతలకు కలుగుతోంది.