ఎన్నికల వేళ ఏపీలో ఈసీ కీలక నిర్ణయం

221

ఏపీ ఎన్నికల సమరంలో మరో కీలక పరిణామం జరిగింది. తెలుగుదేశం పార్టికి సపోర్ట్ చేస్తూ వైసీపీని ఇబ్బంది పెడుతున్నారు అని కొన్ని నెలలుగా ఏపీ నిఘా విభాగం బాస్ ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలి అని వైసీపీ ఈసిని కోరింది, ఈఫిర్యాదుపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఎస్పీలను ఎన్నికల కమిషన్ రాత్రికి రాత్రి బదిలీ చేసింది. వారికి ఎన్నికల బాధ్యతలేవీ అప్పగించవద్దని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అసలు ఎన్నికల విధులకు ఎలాంటి సంబంధం లేని వారిని ఎలా విధుల నుంచి తొలిగిస్తారు అంటూ విమర్శిస్తున్నారు.

Image result for ఎన్నికల వేళ ఏపీలో ఈసీ కీలక నిర్ణయం

ప్రభుత్వానికి సమాచారం అందించే, ముఖ్యమంత్రి రక్షణ బాధ్యతలు మాత్రమే చూసుకునే ఇంటెలిజెన్స్ చీఫ్కు నిజానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదనీ, సీఎస్తో పాటు ఆయన కూడా ఈసీ పరిధిలోకి రారనీ, అయినా ఆయనపై వేటు వేయడం ఆశ్చర్యకరంగా ఉందనీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.