మంగోలి సామ్రాజ్య అధినేత గెంగిస్ ఖాన్ ఎంతటి క్రూరుడో తెలిస్తే భయంతో పరిగెడతారు

1640

మీకు ఎంతో మంది రాజులు వారి చరిత్ర గురించి తెలిసే ఉంటుంది.ఒక్కో రాజుకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది.కొంతమంది మంచి చేసిన వాళ్ళు ఉంటె మరికొందరు నీచపు పనులు చేసిన వారు ఉన్నారు.అయితే అప్పటి రాజులలో అత్యంత క్రూరుడు అయినటువంటి రాజు గురించి మీకు తెలుసా.ఆ రాజు ఎవరో అతను ఎలాంటి వాడో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను విని తెలుసుకోండి.

ఈ ప్రపంచ రాజులలో అత్యంత క్రూర రాజు ఎవరు అంటే గెంగిన్ ఖాన్.ఇతను మంగోలియా రాజు.ఇతనిని మరొక పేరుతో పిలిచేవాడు.అదే చెంగిస్ ఖాన్.ఇతని తల్లిదండ్రులు ఎసుగేయ్.తల్లి హోలున్.ఇతను 1162 లో జన్మించాడు.ఇతను జన్మించే నాటికి మంగోలియా ప్రాంతం అంతా చిన్నచిన్న తండాలుగా ఉండేది.ఒక తాండకు మరొక తాండకు పడేది కాదు.9 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు.దాంతో చాలా చిన్న వయసులోనే చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది.ఒంటరి వాడు అయ్యాడు.అయితే ఆ తర్వాత విల్లు విద్యలు నేర్చుకున్నాడు.యుద్దంలో ,మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి.అంతేకాదు కత్తి తిప్పడంలో మంచి నేర్పరి.ఇతను పేరులో ఖాన్ ఉండడం వలన అందరు ముస్లిం అనుకుంటారు.కానీ కాదు.ఇతను శామనిజం మతానికి చెందినవాడు.ఇతని అసలు పేరు తముజిన్.

12వ శతాబ్దంలో గందరగోళంలో గెంగిస్ ఖాన్ సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు.మంగోలియా గిరిజన ప్రజలను సమైక్యం చేసుకొని మంచూరియా మరియు అల్తై పర్వతాల మద్య భూభాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.ఆ తర్వాత చాలా దేశాల మీద వరుస యుద్దాలు చేసి వాటిని స్వాదీనం చేసుకున్నాడు.1206లో గెంగిస్ ఖాన్ నిర్వహించిన వరుస యుద్ధాలు క్రూరత్వానికి మరియు క్రౌర్యానికి ప్రతీకగా నిలిచాయి. గెంగిస్ ఖాన్ ఆసియా అంతటినీ ఆక్రమించి మంగోలియా సామ్రాజ్య స్థాపన చేసాడు.ఈ సామ్రాజ్య స్థాపన కోసం నాలుగు కోట్ల మందిని ఊచకోత కోశాడు.ఓడిపోయినా రాజుల భార్యలను నగ్నంగా నడిపించి తనకు నచ్చిన వారిని అనుభవించి తన కామ వాంచ తీర్చుకున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మంగోలి సామ్రాజ్య అధినేత గెంగిస్ ఖాన్ ఎంతటి క్రూరుడో తెలిస్తే భయంతో పరిగెడతారు

ఎక్కడికి వెళ్ళిన సరే ఇతను ఆడవాళ్ళ చేత నగ్న ప్రదర్శన చేసేవాడు.మంచి ముఖం చిన్నపెదాలు పొడవాటి జుట్టు మంచి రూపం ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో గడిపేవాడు.అతనికి నచ్చని ఆడవారిని తన సైనికులకు అప్పగించేవాడు.ఇతను ఇండియాకు కూడా వచ్చాడు.సింధు నదీ తీర ప్రాంతంలో ఢిల్లీ రాజుల చేతిలో ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయాడు.కొన్నేళ్ళ తర్వాత అనారోగ్యం కారణంగా ఇతను చనిపోయాడు.ఇతని విగ్రహం నేషనల్ ప్యాలెస్ మ్యుజియం తైపే మరియు తైవాన్ లో ఉంది.ఇదేనండి ఈ ప్రపంచంలో అత్యంత క్రురత్వ రాజు విషయాలు.మరీ ఈ రాజు గురించి ఇతను చేసిన క్రురత్వ పనుల గురించి అలాగే ఇలాంటి రాజుల గురించి ఇంకా మీకు ఎవరైనా తెలిస్తే మాకు కామెంట్ రూపంలో చెప్పండి