నా పేరు సూర్య టీజర్ లో ఇవి గమనించారా చూస్తే నమ్మలేక పోతారు

1008

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా టీజర్ ని విడుదల చేయటం బన్నీ ఫాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇక టీజర్ విషయానికి వస్తే హై ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ సీన్స్ తో మాస్ ని కూడా పర్ఫెక్ట్ గా టార్గెట్ చేస్తూ చాలా తెలివిగా కట్ చేసారు. కోపం నిలువెల్లా నిండిన మిలిటరీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ పాత్ర కొత్తగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఎవరు మిలిటరీ ఆఫీసర్ పాత్రలు చేయకపోవడం ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. దేశం కోసం దేన్నీ లెక్కచేయని తత్వం ఉన్న సూర్యగా అల్లు అర్జున్ బాగా సూట్ అయ్యాడు. అతని పాత్ర పరిచయాన్ని యాక్షన్ కింగ్ అర్జున్ వాయిస్ ఓవర్ లో చెప్పించిన వక్కంతం వంశం సినిమా దేని గురించో చెప్పకనే చెప్పాడు.

కావాలంటే ఈ వీడియో చూడండి

వ‌క్కంతం వంశీ దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా. కె.నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.ఈ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ను కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. పెట్టిన కొద్ది గంటల్లోనే ఈ టీజర్‌ను 25 లక్షలు మందికి పైగా వీక్షించారు.

నీకు సూర్య సోల్జర్.. కాని, ప్రపంచానికి మాత్రం యాంగర్ డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ నిజంగానే ఇంపాక్ట్ గా ఉందంటున్నారు. చ‌చ్చిపోతాను. కాని ఇక్కడ కాదు బోర్డర్‌లో చ‌చ్చిపోతాను అనే డైలాగ్ ఈ ఇంపాక్ట్‌కే హైలెట్‌గా నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27న ఈ సినిమా విడుదల చేయనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ… బ‌న్ని డెడికెష‌న్‌, ద‌ర్శకుడి విజ‌న్ క‌లిస్తే మా ఫ‌స్ట్ ఇంపాక్ట్. సినిమా కూడా ఇదే రేంజిలో ఉండబోతుంది. ఈ చిత్రం వేసవి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలిపారు. చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ… బన్నీ కెరీర్‌లో ఇది హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోతుంది. దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనంతో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడనేదానికి మా ఫ‌స్ట్ ఇంపాక్ట్‌‌కి వస్తున్న స్పందనేనని తెలిపారు.

మిలిటరీ క్యాంపులో సూర్య చూపే తెగువ శత్రువుల మీద అతనికి ఉండే కోపం అన్ని మిక్స్ చేసి వంశీ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది – దేశభక్తినే ఎమోషన్ గా వాడుకోవడం కూడా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సీనియర్ అర్జున్ బన్నీ కి ట్రైనింగ్ ఇచ్చే సీనియర్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. కఠినమైన ట్రైనింగ్ ఇస్తూ సూర్యని మౌల్ద్ చేసే పాత్రలో ఆయన ఉండే అవకాశాలు ఉన్నాయి . చనిపోవాల్సి వస్తే బోర్డర్ కు వెళ్లి చచ్చిపోతాను అన్న బన్నీ ఫినిషింగ్ టచ్ అన్నిటికన్నా మేజర్ హై లైట్.

విశాల్ శేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. అను ఇమ్మానియేల్ ని ఎక్కువగా రివీల్ చేయకుండా తెలివిగా ప్లాన్ చేసారు. గొంతు వినిపించింది కాని సీనియర్ అర్జున్ లుక్ మాత్రం ఇందులో చూపలేదు. షార్ట్ గా కట్ చేసిన మిలిటరీ స్టైల్ హెయిర్ తో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తున్నాడు. సమ్మర్ లో భీభత్సమైన యాక్షన్ తో ఫాన్స్ కే కాదు సినిమా లవర్స్ కి కూడా యాక్షన్ ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాడు సూర్య.