facebook లో భార్యతో దిగిన ఫోటో పెట్టిఇదే చివరి సెల్ఫీ అన్నాడు.

376

పెళ్లి చేసుకునే స‌మ‌యంలో భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ తాముద్ద‌రం క‌లిసి ఉంటామ‌ని హామీ ఇచ్చుకుంటారు. పెళ్లి అంటేనే త‌న పార్ట్ న‌ర్ తో జీవితాంతం క‌లిసి ఉంటూ క‌ష్ట‌సుఖాల‌ను పంచుకునేది. చ‌నిపోయేవ‌ర‌కు జీవితాంతం భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి ఉండ‌ట‌మే పెళ్లిలో ఉన్న అర్థం. నీ పార్ట్ నర్ ఎవ‌ర‌నేది ప్ర‌తిక్క‌రికి దేవుడే నిర్ణ‌యిస్తాడంటారు కొంత‌మంది.

ఈ క్రింది వీడియో చూడండి.

అర్ధాంగి మ‌న జీవితంలో ఓ భాగం. మ‌నలో స‌గం కూడా. పెళ్లి చేసుకున్న దంప‌తులు ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా, త‌ట్టుకోని జీవితాంతం క‌లిసి ఉండటంలోనే అస‌లైన ప్రేమ‌, మ‌ధురానుభూతులు ఉంటాయి. పెళ్లి అంటేనే జీవితాంతం అండ‌గా ఉండ‌టం. అంతేకాని మధ్య‌లో వ‌దిలివేసి వేరే వారిని పెళ్లి చేసుకోవ‌డం అనేది సాంప్ర‌దాయం కాదు. పెళ్లిని స్వ‌ర్గంలో నిర్ణ‌యిస్తారంటారు.


అయితే భార్య‌ను కోల్పోయిన ఓ భర్త ఆవేద‌న మీరు వింట్ క‌న్నీళ్లు పెట్టుకుంటారు. 14 రోజుల న‌ర‌క‌యాత‌న ప‌డిన ఈ సంఘ‌ట‌న గురించి అత‌డి మాటల్లోనే విందాం. అది జ‌న‌వ‌రి 7 వ‌తేది సాయంత్రం 6 గంట‌లు. నా బైక్ మీద నేను , నా భార్య వెళుతున్నాము, త‌మిళ‌నాడు లోని అన్నాన‌గ‌ర్ ద‌గ్గ‌ర నా భార్య బండి మీదినుండి కింద‌ప‌డి..స్పృహ కోల్పోయింది.

Image result for helmet

వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లాను. సిటీ స్కాన్ చేసిన డాక్ట‌ర్లు మెద‌డు ఎడ‌మ‌వైపు ఉబ్బుతుంది బ‌త‌క‌డం క‌ష్టం అని చెప్పారు. దీంతో వెంట‌నే అక్క‌డి నుండి ఓ కార్పోరేట్ హాస్పిట‌ల్ లో జాయిన్ చేయించాను. స‌ర్జ‌రీ చేసిన త‌ర్వాత ఆమె మెద‌డు క్ర‌మంగా స్పందించ‌డ‌మే మానేసింది. ఇక అదే స‌మ‌యంలో నా భార్య 5 నెల‌ల గ‌ర్బావ‌తి. త‌ల్లి కోమాలో, పిండం క‌డుపులో. ఇలా ఇద్ద‌రూ బ‌త‌కడం కోసం పోరాడుతూనే ఉన్నారు.

Related image

కానీ అయిదు రోజుల త‌ర్వాత నా భార్య క‌డుపులోని నా కొడుకు చ‌నిపోయాడు. క‌న్ను తెరిచి లోకాన్ని కూడా చూడ‌కుండా నా బిడ్డ అనంత‌లోకాలకు వెల్లిపోయాడు. త‌న భార్య‌ది బ్రెయిన్ డెడ్ అని తెలిపారు డాక్ట‌ర్లు. కాగా, అవ‌య‌వ‌ధానం గురించి గ‌తంలోనే మేమిద్ద‌రం మాట్లాడుకున్నాం. ఏడుస్తూనే ఆర్గాన్ డొనేష‌న్ పేప‌ర్ పై తాను సంత‌కం చేశాను . జ‌న‌వ‌రి 13 న నా భార్య న‌న్ను విడిచిపోయింది.బైక్ న‌డిపేట‌ప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను, కానీ నా భార్య పెట్టుకోలేదు. అందువ‌ల్లే త‌న భార్య చ‌నిపోయింది. నా భార్య‌కు కూడా ఓ హెల్మెట్ ఇప్పించి ఉంటే…ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య ఉమ ను నేను కోల్పోయేవాడిని కాదు. అందుకే భ‌ద్ర‌త ముఖ్యం.ఒక్క చిన్న అజాగ్ర‌త్త నా జీవితాన్నే నా నుండి దూరం చేసింది .నా భార్య హెల్మెట్ పెట్టుకొని ఉంటే బ్ర‌తికేది.

Related image

ఇప్పుడు నేను ఇంత బాద‌ప‌డాల్సిన అస‌వ‌రం వ‌చ్చేది కాదు. చిన్న హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల నా భార్య ప్రాణాలు కోల్పోయింది. నా భార్య‌తో పాటు బిడ్డ‌ను కూడా కోల్పోయాను. ఇంకెవ‌రికి జ‌న్న‌లో ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌దు. ప్ర‌తిఒక్క‌రూ హెల్మెట్ పెట్టుకొండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. త‌న భార్య ఫోటోను షేర్ చేసిన అత‌ను ఈ విధంగా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. చివ‌రిగా I Miss You Raaa, I Miss You అన్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!