ఐఏఎస్ ఇంటర్వ్యూలో నీ భర్త నిన్ను గ్యాంబ్లింగ్ లో అమ్మేస్తే ఏం చేస్తావ్

1071

దేశంలోనే అత్యున్నత హోదా కలిగిన ఉద్యోగం అది. డిగ్రీలు చదివిన ప్రతి ఒక్కరూ ఆ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటారు.అదే ఐఏఎస్.దీనికోసం ప్రతి ఒక్కరూ ఎంతో కృషిచేస్తారు.ఎంతో కష్టపడితే కానీ ఆ ఉద్యోగం రాదూ.పరీక్షలో పాస్ అవ్వడం ఒక ఎత్తు అయితే చివర్లో ఇంటర్వ్యు పాస్ అవ్వడం ఒక ఎత్తు.ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలు నిర్వహించే స్టాఫ్ అడిగే ప్రశ్నలు చాలా కఠినంగానూ, లాజికల్ గానూ, చిత్ర విచిత్రంగానూ ఉండడంతో పాటు అభ్యర్థుల్ని తికమక పెట్టేలా ఉంటాయి. ఉద్యోగార్థుల తెలివిని పరీక్షించడానికే వారు అలా ప్రశ్నలు వేస్తారు.కొన్నాళ్ల క్రితం సివిల్స్ రాసి, ఐఏఎస్ ఉద్యోగము కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక యువతిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అడిగిన ఒక ప్రశ్న గురించి మీకు చెప్పబోతున్నాను.

Image result for interviews images

ఆమె చెప్పిన సమాదానం వింటే మీరు సూపర్ అనకుండా ఉండలేరు.మరి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటో ఈమె చెప్పిన సమాధానం ఏమిటో తెలుసుకుందామా.వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే,మన పురాణాల్లో ఒకప్పుడు కౌరవ సభలో దుర్యోధనుడితో జూదమాడిన ధర్మరాజు,ఆ జూదంలో ,తన భార్య అయిన ద్రౌపదినే పందెంగా పెట్టి ఓడిపోయాడుకదా..అలాగే నీ భర్త గనుక నిన్నూ గ్యాంబ్లింగులో అమ్మేస్తే నీ పరిస్థితి ఏమిటి..? అలాంటి సందర్భంలో నువ్వు ఏంచేస్తావ్…? అని అడిగారంటా.ఆ ప్రశ్న విన్న వెంబడే ఆమె చాలా తెలివిగా సమాధానం చెప్పింది.. ఆమె ఏం చెప్పిందంటే “ నా భర్త నన్ను గ్యాంబ్లింగులో అమ్ముకోలేడు.. ఎందుకంటే,మన భారతదేశ రాజ్యాంగం మరియు చట్టం ప్రకారం ఒక వ్యక్తికి సొంతమైన స్థలాన్ని గానీ,వస్తువుని గానీ,ఆస్థిని గానీ అమ్ముకొనే హక్కు మాత్రమే ఉంటుంది కానీ,మనుషుల్ని అమ్ముకోవడానికి వీలు లేదు.

Related image

ఎందుకంటే ఏ వ్యక్తి పైనా ఇతరులకి ఎలాంటి హక్కూ ఉండదు.అది ద్వాపర యుగం.ఆ యుగంలో భార్యపై భర్తకి సర్వహక్కులూ ఉండేవి. కానీ ఇది కలియుగం,కంప్యూటర్ యుగం,ఇక్కడ భార్యపై భర్తకి ఎలాంటి హక్కూ ఉండదు. ఆమెకి యిష్టం లేకుండా ఆమెని అమ్ముకొనే హక్కు అస్సలు ఉండదు అని తెలివిగా సమాధనం చెప్పిందట.నిజానికి ఇంటర్వ్యూలంటే సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు అడగాలి.కానీ ఇప్పుడు ఐఏఎస్,ఐపీఎస్ లాంటి కొని బాధ్యతాయుత ఉద్యోగాలకి అభ్యర్థుల్ని ఇంటర్వ్యూల ద్వారా సెలెక్టు చేసేటప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి లోక జ్ఞానానికి సంబంధించిన,లాజికల్ మరియు టిఫికల్ ప్రశ్నల్ని కూడా ఇంటర్వ్యూల్లో అడుగుతున్నారు.దానికి కారణం ఏమిటంటే,ఒక జిల్లాకి కలెక్టర్ అవ్వాల్సిన వ్యక్తికి సమాజంపై ఎలాంటి ఆలోచన ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించగలరు, శాస్త్రాలపైనా పురాణాలపైనా వారికి ఎలాంటి నాలెడ్జ్ ఉందో తెలుసుకొనేందుకే అభ్యర్థుల్ని అధికారులు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.వారు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా అనిపిస్తే ఆ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి వారికి ఐఏఎస్ లు గా సెలెక్ట్ చేస్తారు.మరి వాళ్ళు అడిగిన ప్రశ్న గురించి ఆమె చెప్పిన సమాధానం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ఇంత పెద్ద ఉద్యోగానికి ఇలాంటి తికమక ప్రశ్నలు అడగడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.