సుకన్య సమృద్ధి యోజన పథకం: రూ.250 కడితే చాలు లక్షాధికారి అయినట్టే

1822

సమాజంలో ఆడ పిల్లలకు సమాన అవకాశాలు.. ఉద్యోగాలు.. ఉన్నతమైన చదువు అందించాలని.. భ్రూణ హత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఆ పథకం లోనే భాగంగా బాలికల కోసం కొత్తగా ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.అయితే ఈ పథకం గురించి ఇప్పుడు మీకు ఒక సమాచారాన్ని ఇవ్వబోతున్నాను.విని తెలుసుకోండి.

Govt cuts minimum deposit amount in Sukanya Samrudhi Yojana

సుకన్య సమృద్ధి యోజన బ్యాంకు ఖాతాలో ఏటా తప్పనిసరిగా జమ చేయాల్సిన మొత్తాన్ని కేంద్రం తగ్గించింది. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఈ ఖాతాలో రూ.వెయ్యి డిపాజిట్ చేయాల్సిందేనని నిబంధన ఉండేది. బాలికల కోసం పొదుపు చేసే ఈ పథకాన్ని ఎక్కువమంది ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను సవరించి, బ్యాంకులో జమచేసే మొత్తాన్ని రూ.250కి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సుకన్య సమృద్ధి ఖాతా -2016 నిబంధనలను సవరిస్తూ.. ఖాతా తెరిచేందుకు కనీసంగా రూ.250 డిపాజిట్ చేసేలా వెసులుబాటు కల్పించింది. ఏటా ఖాతాలో పొదుపు చేసే మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.250కి తగ్గించింది.

Related image

గరిష్ఠంగా ఈ ఖాతాలో ఏటా రూ.1.5 లక్షల వరకు జమ చేయొచ్చు. ఈ పథకం ప్రకారం.. బ్యాంకులో ఖాతా తెరిచిన నాటినుంచి 21 ఏండ్ల వరకు ఖాతా చెల్లుబాటు అవుతుంది. ఈ సమయం పూర్తయిన తర్వాత జమచేసిన మొత్తాన్ని ఖాతాదారైన బాలికకు అందజేస్తారు. ఖాతా తెరిచిన నాటినుంచి 14 ఏండ్లపాటు డిపాజిట్లు స్వీకరిస్తారు. దీనితర్వాత నిబంధనల ప్రకారం ఖాతాలో కేవలం వడ్డీ మాత్రమే జమవుతుంది. సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీరేటు ప్రతి మూడునెలలకోసారి మారుతుంటుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వడ్డీరేటును 8.1 శాతంగా నిర్ణయించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

2015లో ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన విజయవంతమైందని 2018-19 బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి జైట్లీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2017 నవంబర్ నాటికి ఈ పథకం కింద 1.26 కోట్లకు పైగా ఖాతాలు తమ పిల్లల పేరుపై తెరిచారని, రూ.19,183 కోట్లు జమ చేశారని చెప్పారు.విన్నారుగా సుకన్య సమృద్దిలో కేంద్రం బీద ప్రజల కోసం కల్పించిన సదుపాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఆడపిల్లల భవిష్యత్ కోసం డబ్బు కూడబెట్టండి.మరి కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం గురించి అలాగే ఈ సుకన్య సమృద్ది గురించి అలాగే ఇంకా ఆడపిల్లల కోసం ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.