బంపర్ ఆఫర్: జనవరి ఒకటిన జన్మిస్తే ఐదు లక్షలు!

945

మ‌రికొద్ది గంట‌ల్లోనే 2017వ సంవ‌త్స‌రానికి వీడ్కోలు ప‌ల‌క‌బోతున్నాం. కొత్త ఏడాది 2018వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌నున్నాం.డిసెంబ‌ర్ 31 నైట్ ఏలా ఎంజాయ్ చేయాలా అని ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటున్నారు క‌దా.. కొత్త ఏడాది, కొత్త ల‌క్ష్యాల‌ని పెట్టుకుని ఉంటారు.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే కొత్త ఏడాదికి టెలికాం కంపెనీలు సిమ్స్ , మొబైల్స్ పై ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తాయి. ఇక షాపింగ్ మాల్స్ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్చంగా బంప‌ర్ ఆఫ‌ర్లు అంటూ ప్ర‌క‌ట‌న‌లు వేస్తాయి. ఇలా త‌మ వ్యాపారాన్ని మ‌రింత‌ పెంచుకోవ‌డానికి కొత్త ఏడాదిని బాగా ఉయోగించుకుంటారు వ్యాపార వ‌ర్గాలు. అయితే ఇప్పుడు మీరు విన‌బోతున్న ఈ ఆఫ‌ర్ మాత్రం చాలాడిఫ‌రెంట్ గా ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. ఇలాంటి ఆఫ‌ర్ మీరు ఎప్పుడూ విని కూడా ఉండ‌రు. ఇంత‌కు ఆ అదిరిపోయే ఆఫ‌ర్ ఏంట‌నుకుంటున్నారు. అయితే చూద్దాం ప‌దండీ.

నూతన సంవత్సరం తొలి రోజున జన్మించే ఆడశిశువుకు ఐదు లక్షల రూపాయల బహుమతిని ఇస్తామని ప్రకటించారు. ఎక్క‌డ‌, ఎవ‌రు ప్ర‌క‌టించారో తెలుసా..బెంగళూరు మేయర్ సంపత్ రాజ్ ఈ ఆసక్తిదాయకమైన ప్రకటన చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరవాసుల్లో ఉత్సాహాన్ని ఇచ్చే ఈ ప్రకటన చేశారాయన. 2018 జనవరి ఒకటో తేదీన జన్మించే శిశువులకు ఐదు లక్ష‌ల రూపాయ‌ల రూపాయ‌లు బ‌హుమానంగా ఇస్తామ‌ని ఆయన ప్రకటించారు. బెంగ‌ళూరు హ‌హాన‌గ‌ర‌పాల‌క సంస్థ నుంచి ఈ డ‌బ్బును చెల్లిస్తామ‌ని చెప్పారు.

Image result for money
అయితే ఇక్కడ కొన్ని షరతులు విధించారు. అందులో ప్రధానమైనవి.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు మాత్ర‌మే బ‌హుమానం ఇస్తామ‌ని తెలిపారు. ఆడశిశువులే అయినా ప్రైవేట్ ఆసుపత్రిలో గాక నగర పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన వారికే ఈ ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుందని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్.

Related image

 

ఇక సహజమైన కాన్పు అనే షరతును కూడా పెట్టారు. సిజేరీయ‌న్ ద్వారా కాకుండా.. సహజంగా నూతన సంవత్సరం తొలి రోజున పుట్టిన ఆడ శిశువులకు న‌గ‌ర‌పాల‌క‌సంస్థ తరఫు నుంచి ఐదు లక్షల రూపాయల బహుమతి దక్కుతుందని మేయర్ తెలిపారు. ఆడపిల్లల జననాలపై కొంతమంది తల్లిదండ్రుల్లో ఉండే వ్యతిరేకతను తగ్గించడానికే ఈ బహుమతిని అనౌన్స్ చేసినట్టుగా మేయర్ తెలిపారు.

Image result for jan 1 2018

ఎక్కువమంది ఆడపిల్లలు పుట్టినా.. వాళ్లందరికీ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ ఈ బహుమతి ఇస్తుందన్నారు. ఆడ‌పిల్ల‌ల త‌ల్లితండ్రుల్లో చైత‌న్యం క‌ల్పించ‌డానికి ఈ బ‌హుమానం ప్ర‌క‌టించిన‌ట్లు చెప్పారు. మొత్తానికి ఈ బ‌హుమానం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయంశంగా మారింది.

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!