PHOTO STORIES

HEALTH & FITNESS

ఖైదీ నెంబర్ 150 లో ఏపీ సీఎం బాబుకు కౌంటర్ ఇచ్చిన చిరు..

ఖైదీ నెంబర్ 150 లో ఏపీ సీఎం బాబుకు కౌంటర్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది సంవ‌త్స‌రాల తరువాత కం బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా రైతుల స‌మ‌స్య‌ల‌పై చిరు చెప్పిన డైలాగుల‌కు థియేట‌ర్లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఖైదీ డైలాగుల‌ను ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌తో పాటు వేమారెడ్డి, బుర్రా సాయిమాధ‌వ్ డీల్ చేశారు. ఈ డైలాగుల్లో ఓ డైలాగ్ ఏపీ సీఎం చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసి చెప్పిన‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది. చిరు నేరుగా చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావించ‌క‌పోయినా ఆ డైలాగ్ మీనింగ్ చంద్ర‌బాబుని ఉద్దేశించి చెప్పిన‌ట్టుగానే స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఓ సీన్‌లో చిరు రైతుల బాధ‌ల‌పై మాట్లాడుతుండ‌గా మ‌రో వ్య‌క్తి రైతుల కోసం ప్ర‌భుత్వాలు రుణ‌మాఫీ చేస్తున్నాయిగా అంటాడు. అప్పుడు వెంట‌నే చిరు రైతుల‌కు రుణ‌మాఫీనా ? ఎక్క‌డ చేస్తున్నారు ? ఎంత చేస్తున్నార‌ని ? కౌంట‌ర్ వేస్తాడు. ఈ డైలాగ్ ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి చెప్పిందేనా అన్న టాక్ న‌డుస్తోంది. ఇక్క‌డ చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక లోటు వ‌ల్ల ఆ రుణ‌మాఫీని క్ర‌మ‌క్ర‌మంగా మాఫీ చేసుకుంటూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో చిరు గ‌ల్లి నుండి ఢిల్లీ పాలిటిక్స్ వ‌ర‌కు త‌ట్టుకున్న గుండెరా ఇది – సముద్రం ఒడ్డున నిల‌బ‌డి, స‌ముద్రం వెన‌క్కి వెళ్లింది క‌దా అని న‌వ్వితే, అదే స‌ముద్రం సునామీతో ముంచేస్తుంది – అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కాను – న‌వ్వుకునే వాడు ఓరోజు ఏడ్చే రోజు వ‌స్తుంది వంటి డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ను, మెగాభిమానుల‌ను అల‌రించేలా ఉన్నాయి. 

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

TOP STORIES TODAY

ROMANCE

CRIME NEWS

TECHNOLOGY NEWS

LATEST NEWS

TOP STORIES TODAY

TECHNOLOGY NEWS